యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపుమేరకు ఈ నెల 30, 31వ తేదీల్లో ఆల్ ఇండియా బ్యాంకర్స్ సమ్మెను ప్రకటించిందని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ అధ్యక్షుడు మునెయ్య చెప్పారు.
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం శ్రీకాళహస్తి భారతీయ స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో యూనియన్ సభ్యులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మునెయ్య మాట్లాడుతూ… పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దించాలన్నారు. స్టాఫ్ రిక్రూట్మెంట్ జరపాలన్నారు. వేతన సవరణ, పాత బకాయిలు రికవరీ చెల్లించాలన్నారు. ఈ న్యాయమైన కోరికలను వెంటనే పరిష్కరించాలన్నారు.
లేదంటే సమ్మె తీవ్రవంతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈనెల 30, 31న సమ్మెకు ఖాతాదారులు, ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ మేనేజర్ స్వప్నప్రియ, గోపీనాథ్, మల్లీశ్వరి లావణ్య, ప్రియా, భార్గవి, మణి, అరుణ్ ప్రసాద్, వెంకటేష్, బాలకృష్ణారెడ్డి, సురేష్, పూజ తదితరులు పాల్గొన్నారు.
.