తెలుగు భాష మాట్లాడే ప్రజలందరికీ ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం అవసరమని గుర్తించి రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహారదీక్షతో ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చిరస్మరణీయులని ప్రధానోపాధ్యాయులు రమణయ్య అన్నారు.
గురువారం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మండలంలోని స్థానిక కల్లివెట్టు ఉన్నత పాఠశాలలో ప్రార్ధనా సమావేశలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గురించి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు నాదెండ్ల మురళి విద్యార్థులకు వివరించారు.
ఈ సమావేశంలో ఉపాధ్యాయులు యువశ్రీ మురళి, సురేష్ బాబు, ఒబ్బుదేవి ప్రసాద్, జయసుధ,రామక్క, దేవేంద్ర, దాసు విద్యార్థులు పాల్గొన్నారు.
.