• About Us
  • Contact Us
  • Our Team
Tuesday, August 25, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

క్రిస్మస్ రోజున పిల్లలతో చూడదగిన చిత్రాలు

admin by admin
December 25, 2021
0
క్రిస్మస్ రోజున పిల్లలతో చూడదగిన చిత్రాలు

క్రిస్మస్ వచ్చేసింది కదా!! మరి హాలిడే కాబట్టి అన్ని రకాల పనులనుంచి కొద్దిగ రెస్ట్ తీసుకుని క్రిస్మస్ సినిమాలు చూసేద్దామా? క్రిస్మస్ సందర్భంగా, ఈ రోజు చూడదగిన సినిమాలతో ఒక చిన్న లిస్ట్ తయారు చూసి, ఆదర్శిని మీకు మీ క్రిస్మస్ బహుమతి తెచ్చేసింది! 

ఆదర్శిని పాఠకులు అందరికీ క్రిస్ మస్ శుభాకాంక్షలతో అందిస్తున్న ప్రత్యేక కథనం..

హోం అలోన్

ఏ సినిమాని చూసి ఉన్నా, చూడకుండా ఉన్నా, హోం అలోన్‌ను మీరు ఒకసారి అయినా చూసి ఉంటారు. అయితే క్రిస్మస్ సందర్భంగా మరొకసారి చూసి నవ్వుకుంటే ఏం అయిపోయింది?? క్రిస్మస్ అనగానే నాకు గుర్తుకు వచ్చే మొదటి సినిమా ఇదే. తన కుటుంబం తనని ఇంట్లోనే మర్చిపోయి ట్రిప్‌కి వెళ్లిపోయాక, కెవిన్ వాళ్ల ఇంట్లో ఇద్దరు దొంగలు పడుతారు. కెవిన్ ఇంటిని వాళ్లిద్దరినుంచీ కాపాడుతూ, తన కుటుంబం కోసం తనకి ఉన్న ప్రేమ గురించి తెలుసుకుంటాడు. ఒక చిన్న పిల్లాడు దొంగలని ఆటపట్టించడం మనకు సిసింద్రీ సినిమాను గుర్తు చేస్తుంది. కాకపోతే ఇక్కడ బాబు కొంచెం పెద్దయ్యాడు, అంతే.

ది నైట్‌మేర్ బిఫోర్ క్రిస్మస్

‘హాలోవీన్ టౌన్‌’కు చెందిన జాక్ ఒకరోజు ‘క్రిస్మస్ టౌన్’ను చూసి తక్షణమే ఆ చోటును ఇష్టపడడం మొదలుపెడతాడు. అయితే, హాలోవీన్ అనేది భయంకరంగా ఉండే పండుగ.. క్రిస్మస్ అనేది నవ్వులతో నిండి ఉండే పండుగ. అలాంటి చోటుకు చెందిన వాడు ఇలాంటి చోటును ఇష్టపడితే ఎలా?? పైగా, శాంటా క్లాస్‌ను అపహరించాలి అనుకునేది.. మంచిది కాదేమో? టిమ్ బర్టన్‌కు ఉన్న కళాత్మకత ఎప్పుడూ విచిత్రంగా ఉన్నా, నాకు చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది. టిమ్ బర్టన్ సినిమాలు, శైలి మీకు ఇష్టం అయితే, క్రిస్మస్ రోజున ఈ సినిమాను చూడాల్సిందే.

పోలార్ ఎక్స్‌ప్రెస్

క్రిస్మస్ అనగానే నాకు గుర్తుకు వచ్చే సినిమాల్లో ఇది కూడా ఒకటి. పిల్లలకు శాంటా క్లాస్ అంటే, క్రిస్మస్ అంటే, ఎంత ప్రేమ ఉంటుందో ఈ సినిమా చూపిస్తుంది. అద్భుతంగా ఉండే యానిమేషన్ ఇంక పాత్ర అభివృద్ధి నాకు చాలా చాలా నచ్చాయి. ఈ సినిమాలో ప్రయాణీకులకు ఏవైతే టికెట్స్ ఇస్తారో, అలాంటివి మనకు కూడా ఎవరో ఒకరు ఇస్తే బావుణ్ను. ఒక అబ్బాయి ట్రైన్ ఎక్కేసి, శాంటా క్లాస్‌ను కలిశాడంటే, నమ్మబుద్ధి అవుతుందా??

ఎ క్రిస్మస్ కారోల్

పిల్లలకు ఎప్పుడైనా ఈ కథ ఇంగ్లీష్ బుక్‌లో వచ్చి ఉండచ్చు. ఈ సినిమా ప్రసిద్ధి చెందిన రచయిత ఛార్ల్స్ డికెన్స్ రాసిన కథ మీద ఆధారితమైనది. పిసినారి అయిన ఇబినీజర్ స్క్రూజ్‌ను క్రిస్మస్ ముందు రోజు రాత్రి మూడు భూతాలు కలుస్తాయి. ఆ మూడు భూతాలు తను ఇది వరకు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఇకపైన చనిపోయిన తరువాత ఎలా ఉండబోతున్నాడు అనేవి చూపిస్తాయి. స్క్రూజ్ తన తప్పులను తెలుసుకుని, తరువాత రోజు నుండి మరింత సంతోషంగా, పిసినారి కాకుండా ఉంటూ, ఊరినంతా కూడా ఆశ్చర్యపెట్టేస్తాడు. మనందరికీ (ఇంక నాకు) ఇష్టమైన జిమ్ క్యారీ ఈ యానిమేషన్‌లో స్క్రూజ్ పాత్ర పోషిస్తాడు.

స్క్రూజ్‌డ్

నాకు ఇబినీజర్ స్క్రూజ్ కథ చాలా ఇష్టం. కానీ ‘స్క్రూజ్‌డ్’ అనే సినిమా అదే కథని వేరొక రకంగా చూపిస్తుంది. అసలు కథలో స్క్రూజ్ ఒక వ్యాపారి అయితే, ఇక్కడ స్క్రూజ్ ఒక టీవీ పర్సనాలిటీ. అత్యంత స్వార్థపరుడు అయిన ఫ్రాంక్‌ను తన మూడు భూతాలు కలిసి, తను మారాల్సిన అవసరం తనకు చూపిస్తాయి.

హౌ ది గ్రించ్ స్టోల్ క్రిస్మస్

క్రిస్మస్ రోజున మీకు ఎక్కువ టైం లేకుండా ఉండి, అయినా కూడా సినిమాలతో క్రిస్మస్ సెలెబ్రేట్ చేసుకుందాము అని అనుకుంటున్నారంటే, ఈ 26 నిమిషాల చిన్న సినిమాని చూసేయచ్చు. ఈ సినిమాలో, ఒక నీచమైన గ్రించ్ వోవిల్లెకు చెందిన వాళ్ల క్రిస్మస్‌ను చెడగొట్టాలని చూస్తుంది. ఈ సినిమా 1966లో వచ్చింది. ఇప్పుడు వస్తున్న యానిమేషన్స్ అన్నీ బాగానే ఉన్నా కూడా, పాత యానిమేషన్‌లను ప్రేమించడం మనం ఎప్పటికీ మానెయ్యము. ఈ సినిమా కూడా పాతతరహా యానిమేషన్‌లోనే తీశారు.

హౌ ది గ్రించ్ స్టోల్ క్రిస్మస్

ఫరవాలేదు లెండి, కావాలనే మళ్లీ ఈ సినిమాను పెట్టాను. కాకపోతే దీంట్లో తేడా ఏంటంటే, నిజం యాక్టర్లు ఉంటారన్నమాట. గ్రించ్ పాత్ర నాకు ఇష్టమైన జిమ్ క్యారీ పోషించాడు. రాన్ హావర్డ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అందరి మనసులనూ ఆకట్టుకుంది. బాక్స్ ఆఫీస్‌లో నాలుగు వారాల వరకు నెం. 1 స్థానంలో ఉంది.

ప్రస్తుతానికి ఈ సినిమాలు చాలనుకుంటా..? క్రిస్మస్ జరుపుకునేవారందరికీ ఆదర్శిని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతోంది. కాకపోతే, జాగ్రత్తగా, సురక్షితంగా, ఇంట్లోనే జరుపుకోండి. (బయటకి వెళ్లవలసి వస్తే మాస్క్ మర్చిపోవద్దు!!)

.. ఆదర్శిని శ్రీ

Tags: adarsini Sriadarsini story feature storychrismas greetingsmerry christmasక్రిస్ మస్ గ్రీటింగ్స్క్రిస్ మస్ శుభాకాంక్షలు
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

2.8.26 కథానిధి సమీక్ష: సామాజిక వాస్తవికతకు అక్షర దర్పణం

9 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply