• About Us
  • Contact Us
  • Our Team
Sunday, July 26, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

అమెరికా-చైనా అంతరిక్ష యుద్ధం మొదలైనట్టేనా?

admin by admin
December 29, 2021
0
అమెరికా-చైనా అంతరిక్ష యుద్ధం మొదలైనట్టేనా?

గ్రాఫిక్స్ మాయాజాలం అత్యున్నత స్థాయిలో మాత్రమే కనిపించే సినిమాల్లోని విన్యాసాలకు మించిన యుద్ధం ఇది. వాస్తవంలో చోటు చేసుకుంటే ఎలా ఉంటుంది? అధికారికంగా ధ్రువీకరించలేం గానీ.. పరిణామాలను గమనిస్తోంటే.. అగ్రరాజ్యాల మధ్య అంతరిక్షంలో జరగబోయే యుద్ధాలకు శ్రీకారం పడినట్లే కనిపిస్తోంది. అమెరికా చైనా నడుమ అంతరిక్ష వార్ మొదలైందా.. అంటే ఈ వార్త చూస్తే మాత్రం ‘అలాగే అనిపిస్తోందే’ అని నమ్ముతాం.

ప్రపంచ దేశాలు కలిపి నెలకొల్పుకున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎన్ఎస్)కు పోటీగా, చైనా ‘తియాంగాంగ్’ పేరుతో ఒక సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకుంటోంది. ఈ ఏడాది ఏప్రిల్ 29న దాన్ని అంతరిక్షంలోకి పంపారు. అప్పటినుంచి భూమికి 390 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో అది పరిభ్రమిస్తోంది. చైనా అంతరిక్ష కేంద్రం పని ప్రారంభించినప్పటినుంచి.. యావత్ అంతరిక్ష కేంద్రాల మీద చైనాదే గుత్తాధిపత్యం అవుతుందేమోననే వాదన కూడా ఒకటి ఆ వర్గాల్లో వినిపిస్తోంది.

తాజా గొడవ ఏంటంటే.. అమెరికాకు చెందిన ప్రముఖ  పారిశ్రామిక వేత్త ఎలాన్ మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్ కు చెందిన రెండు ఉపగ్రహాలు.. తమ అంతరిక్ష కేంద్రానికి అతి దగ్గరగా వచ్చాయని చైనా అంటోంది. ఇంచుమించుగా.. తమ అంతరిక్ష కేంద్రాన్ని ధ్వంసం చేసేందుకు అవి వచ్చాయన్నట్టుగా చైనా వాదన ఉంది. అమెరికా ప్రయోగించిన అధికారిక ఉపగ్రహాలు కాకపోవచ్చు గానీ.. స్పేస్ ఎక్స్ అనేది అమెరికా కేంద్రంగా నడిచేదే గనుక. స్పేస్ ఎక్స్ ఉపగ్రహాలు తమ అంతరిక్ష కేంద్రానికి దగ్గరగా వస్తే.. అది అమెరికా కుట్రే అని అభివర్ణించడానికి చైనాకు కొంత దారి దొరుకుతుంది.  ఇలా రెండు స్పేస్ ఎక్స్ ఉపగ్రహాలు తమ కేంద్రానికి దగ్గరగా వచ్చాయనేది చైనా మాట. ఈ విషయంపై ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు కూడా చేశారు.

అంతరిక్ష యుద్ధం మొదలైనట్టేనా?

రెండు స్పేస్ ఎక్స్ ఉపగ్రహాలు తమకు దగ్గరగా వచ్చాయని చైనా ఆరోపిస్తోంది. అయితే తర్వాత అవి ఏమయ్యాయి? ఇది కూడా ఆసక్తికరమైన అంశం.

ఎందుకంటే.. భూమినుంచి 555 కిమీల కక్ష్యలో తిరగాల్సిన స్పేస్ ఎక్స్ స్టార్ లింక్ 1095 అక్కడినుంచి కిందికి వచ్చి 382 కిమీల కక్ష్యలోకి వచ్చేసింది. తియాంగాంగ్ కు అతి చేరువగా కూడా వచ్చిందిట. దానివల్ల తమ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాముల భద్రత ప్రమాదకరంగా మారిందని చైనా ఆరోపించింది. దానివలన ముప్పు రాకుండా ఉండడానికి తియాంగాంగ్ ప్రత్యేక విన్యాసాలు (?) చేసిందట. అయితే ఆ తర్వాత.. రెండు నెలలకు స్పేస్ ఎక్స్ స్టార్ లింక్ 1095 భూమి వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోయింది!

స్పేస్ ఎక్స్ కే చెందిన మరో ఉపగ్రహం స్టార్ లింక్ 2305 ఆ తర్వాత తియాంగాంగ్ కు దగ్గరగా రావడమూ.. తియాంగాంగ్ ప్రత్యేక విన్యాసాలు చేయడంతో.. అది 550 కిమీల ఎత్తులోని మరో కక్ష్యలోకి వెళ్లిపోవడమూ కూడా జరిగింది.

అయితే ఈ ప్రత్యేక విన్యాసాలు అంటే అర్థం ఏమిటో బోధపడడం లేదు. స్పేస్ ఎక్స్ ఉపగ్రహాలు తమ సమీపానికి వచ్చాయని అనిపించగానే.. తియాంగాంగ్ నుంచే దాడి జరిగిందా అని కూడా అనుమానాలు పుడుతున్నాయి. స్టార్ లింక్ 1095 భూవాతావరణంలోకి వచ్చి కాలిపోవడం ఇందుకు ఒక ఉదాహరణగా భావిస్తున్నారు. స్టార్ లింక్ 2305 ను కూడా తియాంగాంగ్ ‘తరిమికొట్టిందని’ అనుకోవాలి.

అదే నిజమైతే మాత్రం.. అమెరికా- చైనా మధ్య అంతరిక్ష యుద్ధం చాలా చాలా స్పస్టంగా ప్రారంభం అయినట్టే భావించాలి. ఇది ముందుముందు ఎలా పరిణమిస్తుందో చూడాలి.

Tags: america china space warchinaellan maskspace exSPACE EX STAR LINKspace wartiangongtiangong space stationఅంతరిక్ష యుద్ధంఅమెరికాఅమెరికా చైనా యుద్ధంచైనాతియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంస్పేస్ ఎక్స్
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply