ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య నగరినియోజకర్గం శాఖ వారి ఆధ్వర్యంలో కార్తీకమాసం సందర్భంగా భక్తులు తరలివెళ్లి.. అగ్నిలింగ క్షేత్రంగా పేరుగాంచిన తిరువణ్నామలైలో గిరిప్రదక్షిణ చేశారు.
స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సరం కార్తీకబహుళ సప్తమి, కార్తీక నెలలో నవంబరు 26 వతేదీనాడు వీరు తిరువణ్నామలై యాత్ర నిర్వహించారు.
కార్తీక మాస సందర్భంగా ఆశ్లేష నక్షత్రం నాడు వనభోజనం మరియు తిరువన్నామలై మహా జ్యోతి దర్శనం కోసం 35 మంది బృందం తో బయలుదేరి వెళ్లారు.
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం మునివెంగన్నపల్లి గ్రామంలో వెలసిన శ్రీ ఇరుగలమ్మ ఆలయ ప్రాంగణం లో ఉసిరి, మారేడు వృక్షం క్రింద మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. సామూహిక కుంకుమార్చన, వన భోజనం నిర్వహించారు.
తిరువన్నామలై (అరుణాచలం) యాత్ర బయలుదేరి అరుణాచల జ్యోతి, స్వామివారి దర్శనం, గిరి ప్రదక్షిణం చేశారు. ఈ యాత్రలో వందవాసి మహేష్ శర్మ, పురాణం నవీన్,శివకుమార్, లంకా నవీన్, నాగరాజు, జనార్ధన్ తదితరులు పాల్గొన్నట్టు ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య జిల్లా గౌరవాధ్యక్షుడు అరిపిరాల శ్రీనివాసులు శర్మ తెలియజేశారు.
.

Discussion about this post