నిజమో కాదో గానీ.. తిరుమల వేంకటేశ్వరుని దర్శంచుకున్న ప్రతి రాజకీయ నాయకుడు బయటకు వచ్చాక మీడియాతో రాష్ట్రంలో ప్రజలందరూ క్షేమంగా ఉండాలని దేవుడిని కోరుకున్నా అని చెబుతారు. సోమవారం తిరుమలేశుని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాబూమోహన్ కూడా అలాంటి డైలాగులే చెప్పారు. ఆయన ప్రస్తుతానికి తమ పార్టీని ప్రసన్నం చేసుకునే ఆలోచనతో ఉన్నారేమో.. బీజేపీ కోసం దేవుడిని ప్రార్థించానన్నారు.
సోమవారం ఉదయం తెలంగాణ బిజెపి నేత బాబు మోహన్ శ్రీవారిని దర్శించుకున్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీ గెలవాలని స్వామి వారిని ప్రార్థించానని ఆయన చెప్పారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపి గెలవాలని అక్కడ బిజెపి మేయర్ రావాలని అభిలాషను వ్యక్తం చేశారు.
ఎన్ని సీట్లు వస్తాయని ముందుగా జోస్యం చెప్పలేనని, కానీ గెలుపు మాత్రం తప్పకుండా దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం సాగిస్తున్న అస్తవ్యస్త పాలన కారణంగానే ప్రజలు బిజెపిని కోరుకుంటున్నారన్నారు.
దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచాక బిజెపిలోకి చేరికలు పెరిగాయని, రాష్ట్రం బాగు పడాలంటే.. బిజెపి తప్ప మరో పార్టీ లేదని ప్రజలు భావిస్తున్నారని బాబూమోహన్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఇక వచ్చే అవకాశం లేదని బిజెపి నేత బాబు మోహన్ వ్యాఖ్యానించారు.
for all GHMC election related news click here
.

Discussion about this post