గ్రేటర్ ఎన్నికల వేళ మరోసారి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా మారారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పటికే గ్రేటర్ ప్రచారంలో కాంగ్రెస్, తెరాసలు దూసుకుపోతున్నాయి. భాజపా కూడా అదే స్థాయిలో ముందుకు వెళ్తున్నప్పటికీ.. అనుకున్నంత ప్రచారం దక్కడం లేదని బాహాటంగానే మనకు అర్ధమవుతోంది. పార్టీ నుంచి బండి సంజయ్, డీకే అరుణ, రఘునందన్‌రావు, అరవింద్, కిషన్‌రెడ్డిలు ప్రచారం చేస్తున్నా… అక్కడక్కడ వెలితి కనిపిస్తోంది.
నగరంలోని సెటిలర్ల ఓట్లను ఆకర్షించాలంటే ఖచ్చితంగా ఆంధ్రా ప్రాంతం నుంచి ఉన్న బలమైన నాయకుడు ఇప్పుడు భాజపాకు అవసరం. ఓ వైపు తెలుగుదేశం పార్టీ బాలయ్యను రగంలోకి దింపి సెటిలర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. మరోపక్క తెరాస గతంలో మాదిరిగానే సెటిలర్లపై సవతి ప్రేమ చూపుతోందనే అభిప్రాయం కూడా పలువురిలో ఉంది.
గ్రేటర్‌లో పట్టు సాధించాలంటే 100పైగా సీట్లు గెలవాల్సిన అవసరం ఉంది. తెరాస కాస్తా కష్టపడ్డా…. ఎంఐఎం లేదా ఎక్స్ ఆఫిషియో ఓట్లతో గట్టెక్కే అవకాశం ఉంది. ఈ సమయంలో కమలం పట్టు సాధించాలంటే చాలా కష్టపడాలి.
ఇందుకోసం హస్తినలో బీజేపీ ఉన్నపెద్దలు పవన్‌ని ఢిల్లీకి రావాలని కబురు పంపారు. దీంతో పవన్ కల్యాణ్, ఆయనవెంట నాదెండ్ల మనోహర్ ఇద్దరూ బయల్దేరి ఢిల్లీ వెళ్లారు. భవిష్యత్ బంధం గురించి, గ్రేటర్ఱ ఎన్నికల్లో సహకారం గురించి.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, మరికొందరు కీలక నాయకులు పవన్ తో మంతనాలు సాగించే అవకాశం ఉంది.
గతంలో సీఎం కేసీఆర్‌పై పవన్ కళ్యాన్ చేసి వ్యాఖ్యలు పెద్ద దూమారాన్నే రేపాయి. అదే విధంగా సీఎం కేసీఆర్ కూడా పవన్ గురించి వ్యంగ్యంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితల మీద ఎదురుదాడికి దిగి ప్రజల్లో దూసుకపోతే తప్ప పార్టీకి ఆదరణ కనిపించేలా లేదు.
జనసేన, భాజపా పొత్తూ మరింత బలంగా తయారవ్వాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గ్రేటర్‌లో ప్రచారం చేసి విజయంలో కీలక పాత్ర పోషించాల్సిన తరుణం ఇది. మరోవైపు సినిమారంగంతో ఉన్న సంబంధాలు కూడా ఏ విధంగా పని చేస్తాయో వేచి చూడాలి మరి.
మొత్తానికి జనసేనాని పవన్ కల్యాణ్ ను బీజేపీ శరణు కోరుతున్నదనే సంగతి స్పష్టంగా అర్థమవుతోంది. దుబ్బాక విజయం ఏదో గాలివాటుగా వచ్చింది కాదని.. తెలంగాణలో పార్టీకి నిజంగానే ప్రజాదరణ దక్కుతోందని నిరూపించుకోవాలంటే.. ఆ సంగతి వారు గ్రేటర్ ఎన్నికల్లో నిరూపించుకోవాలి. అందుకోసం వారు పవన్ సాయం అర్థించడం తప్ప వేరే గత్యంతరం లేదు.
ఇవీ చదవండి : కేసీఆర్ గారూ.. ఇందులో కిక్ ఏం ఉంటుంది సార్ అన్ని వివరాలూ లాగారు .. ఇక పిలవడమే నాగ్ - అఖిల్ కాంబోలో సెకండ్ మూవీ కుప్పం సమీపంలో జర్నలిస్టు దారుణ హత్య
.

Discussion about this post