పుస్తకంతో విజ్ఞానం పెంపొందించుకోవాలని ఎంఆర్ పల్లి సురేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు తిరుపతి పద్మావతి పార్క్ వద్ద విశాలాంధ్ర బుక్ స్టాల్ ని సీఐ సురేందర్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుస్తకం చదివి విజ్ఞానం ఎంతో సంపాదించుకో గలరు అని అన్నారు.
కంప్యూటర్ ,సెల్ లు సరికాదని, పిల్లలకు పుస్తక పఠనం ఎంతో అవసరమని అన్నారు. నేను విద్యార్థి దశలోనే విశాలాంధ్ర బుక్ హౌస్లో మహనీయుల పుస్తకాలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పుస్తకాలు కొనుక్కొని బాగా చదివే వాడిని అన్నారు.
ఇప్పుడు కూడా ఎక్కువశాతం విశాలాంధ్ర పుస్తకాలే చదువుతున్నాని అన్నారు. తిరుపతి ప్రజలు ఈ బుక్ స్టాల్ ని ఎంతో ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్, నదియా,ఎన్ శివ, సిహెచ్ శివ, ఏపీ బాల, బండి చలపతి, ఉదయ్ కుమార్, సురేష్, కుమార్, అలిపిరి బాల, ప్రమీల, నరేష్, వెంకటేష్ ,నాగిరెడ్డి, వినయ్ విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, చిన్న శంకర తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post