• About Us
  • Contact Us
  • Our Team
Tuesday, August 18, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

ఫాదర్స్ డే స్పెషల్ : వెలుగు దివ్వె నాన్న!

admin by admin
June 21, 2026
0
ఫాదర్స్ డే స్పెషల్ : నిశ్శబ్ద త్యాగమూర్తి… ‘నాన్న’!

చాగంటి ప్రసాద్
9000206163

నడక నడతలు నడకను నాటు కొనగ
నతులు నుతులను సుతులకు నడిపి జూపి
నీతి నియమాలు విలువలు నిలువ నేర్పు
నాకవంద్యుడు నాకిల నాన్నయనగ.

మాతృదేవో భవ! అన్న నోటితోనే పిల్లల చేత పితృదేవోభవ! అని పలికిస్తారు మన గురువులు.

తల్లి జన్మనిస్తే, తండ్రి నడత నేర్పే గురువవుతాడు. భారతీయ జీవన విధానంలో తండ్రి పాత్ర అద్వితీయమైనది. ఒక కుటుంబ వ్యవస్థ కు పెద్దగా, కుటుంబ బరువుభాధ్యతలు ఆనందంగా మోస్తూ, కర్తవ్యోన్ముఖుడై కుటుంబ అవసరాలు తీర్చిన తర్వాతే తన గురించి ఆలోచించే త్యాగధనుడు నాన్న!

నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి త్యాగం ప్రత్యక్షంగా మనకు కనిపిస్తుంది. ఆలనాపాలనలో తండ్రి పాత్ర పరోక్షం. ఒక గురువు గా పిల్లలని సక్రమమైన మార్గంలో నడిపించి వారిని ఈ దేశం గర్వపడే గొప్ప పౌరులుగా తయారు చేయడం లో తండ్రి పాత్ర అనిర్వచనీయమైనది.

యుక్తవయస్సు ముందు తండ్రి కొడుకుకి బ్రహ్మోపదేశం చేసిన గురువుగా దర్శనమిస్తాడు. ఆడపిల్లకి బయట ఎలా మసుకోవాలో తల్లి జాగ్రత్తలు చెప్తే, తండ్రి ఆమెను కళ్ళల్లో పెట్టుకుని అతిజాగ్రత్తగా చూసుకుంటాడు.

పితృసామ్యం కుటుంబ వ్యవస్థకి ఒక ఇరుసులాంటిది. తరతరాలుగా అవిఛ్ఛన్నంగా కొనసాగుతున్న ఈ భారతీయ అస్థిత్వానికి ఆయువుపట్టు.

తండ్రి తన అనువంశికంగా వచ్చిన విద్యని తరతరాలుగా తన పుత్రులు పౌత్రులు ప్రపౌత్రులకు పంచి దానికి కాల దోషం పట్టకుండా కాపాడుకుంటూ రావడం మన సనాతన ధర్మ అనుష్ఠానం. దానివల్ల ఈ భారతజాతికి మహోన్నత ఉపకారం జరిగిందని మనం నమ్ముతాము. అందువల్ల ఎవరి వృత్తులు వారికి వారితో పాటు సమాజానికి ఉపయోగపడతాయని మన పూర్వీకులు గ్రహించారని తెలుస్తోంది.

మనతో పాటు పిల్లలు ఎదుగుతూ తండ్రి ప్రవర్తనని అనుకరిస్తారు. అందుకే నాన్న ఎప్పుడికప్పుడు వాళ్ళల్లో తనను చూసుకుంటూ తన ప్రవర్తన వారికి ఆదర్శప్రాయంగా ఉండేలా జాగ్రత్తపడతాడు. వాళ్ళకు ఒక గురువుగా మార్గదర్శిగా, వీలైతే స్నేహితుడిగా మారి వాళ్ళ అవసరాలను తీర్చడంలో తాదాత్మ్యమైన యోగిలా ఇల్లే ప్రపంచంగా గడిపే నాన్నలెందరో!

ఆడపిల్లలకి తండ్రి అంటే ఎక్కువ ప్రేమ ఉంటుందంటారు. దానికి కారణం, వాళ్ళు పుట్టిన వెంటనే కళ్ళుతెరచి చూసిన మొట్టమొదటి మగవాడు నాన్న. అలాగే తండ్రి కూతురిలో తన తల్లిని చూసుకుని మురిసిపోతాడు. పెళ్ళయ్యాకా అత్తవారింటికి పంపలేక పంపలేక పంపుతూ కన్నీరు మున్నీరవుతాడు.

ఉధ్గ్రంధమైన శ్రీ రామాయణం తీసుకుంటే తండ్రి దశరధుని ఆజ్ఞను శిరసావహించిన కొడుకుగా శ్రీరాముడు, పుత్రవాత్సల్యాపూరితుడైన తండ్రిగా దశరధుడు ఇద్దరికీ ఇద్దరూ సాటి. తండ్రి నెరవేర్చవలసిన ధర్మాన్ని తన భుజస్కంధాలమీద వేసుకున్న పుత్రుడు, తనకు దూరమై పుత్రగాఢ పరిష్వంగాన్ని పోగొట్టుకుని రాముణ్ణి యవరాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేయలేకపోతున్నానని విలపించిన తండ్రిగా దశరథుణ్ణి మనం చూస్తాం. వారిద్దరూ ఈ జాతి ప్రతీకలు.

నాన్నలని అవహేళన చేసే పిల్లలు, వారిముందు ధూమపానం, మధిరా త్రాగే దుష్ట సంస్కృతి మనది కాదు. పాశ్చాత్యులు లాగా తండ్రిని స్మరించుకోడానికి ఒక రోజంటూ లేదు. అన్ని రోజులు నాన్నవే! ఎందుకంటే తండ్రి లేకపోతే మనం లేము కాబట్టి.

“వాగర్ధా వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే!
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ”

వాక్కు అర్థం దేనికదే ఒకటికొకటి ఆధారపడినట్టు తల్లిదండ్రులు ఇద్దరూ ఒక్కరే. వేరు చేసి మాట్లాడలేం.

ఒకరు ఓర్పు, మరొకరు కూర్పు.
ఒకరు ఆధారం, మరొకరు ఆలంబన.
ఒకరు దిక్కు, మరొకరు దిక్సూచి.

అహర్నిశలు కుటుంబవ్యవస్థకు, తద్వారా సమాజ శ్రేయస్సుకు పాటుపడుతున్న ఎందరో నాన్నలని స్మరించుకుంటూ..

Tags: chaganti prasadFATHERS DAYFATHERS DAY 2026చాగంటి ప్రసాద్చాప్ర రాతలుఫాదర్స్ డేఫాదర్స్ డే స్పెషల్
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply