మహిళలపై అత్యాచారాల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని తిరుపతి పార్లమెంటరీ మహిళా విభాగం అధ్యక్షురాలు చక్రాల ఉష అన్నారు.
రేణిగుంట మండలంలో లైంగిక వేధింపులకు గురైన ఆరేళ్ల బాలికను బుధవారం ఆమె పరామర్శించారు. సంఘటన పూర్వాపరాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా చక్రాల ఉష మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో ప్రతి రోజూ మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు అరాచకాలు, అత్యాచారాలు హత్యలు పెరిగి పోతున్నయన్నారు. రాష్ట్రo లో శాంతిభద్రతలు పూర్తిగా కనుమరుగు అయ్యాయని… ఆడపిల్లల మాన, ప్రాణాలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర హోం మంత్రి మహిళ అని చెప్పే ఈ వైసీపీ ప్రభుత్వంలో అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడట్లేదన్నారు. చట్టబద్దత లేని దిశా చట్టం పేరుతో హడావుడి చేసే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మహిళా సంరక్షణలో విఫలమైందన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ ఇన్ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు తాను రేణిగుంటకు వచ్చినట్లు ఆమె చెప్పారు.
రేణిగుంట మండలం ఇందిరా నగర్ కాలనీకి చెందిన మునిరాజా అనే వైసీపీ కార్యకర్త ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు స్థానికుల ద్వారా తనకు తెలిసిందన్నారు. ఇతనిని కఠినంగా శిక్షించాలని ఉష డిమాండు చేశారు. దిశ చట్టానికి దశ లేకుండా పోయిందని… గన్ కంటే ముందు వస్తాడన్న జగన్ ఏమయ్యాడని ఈ సంధర్బంగా ఆమె ప్రశ్నించారు. నిందితుడికి కఠినంగా శిక్షించే వరకు పోరాడుతామని తెలియజేసారు.
ఇక తొట్టoబేడు మండలం కాసరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఓ వైద్యుడు అక్కడే పనిచేసే సూపర్ వైజర్ పై వేధింపులకు పాల్పడటం బాధాకరమన్నారు. నాలుగు నెలల క్రితం శ్రీకాళహస్తిలో ఓ కానిస్టేబుల్ చేతిలో మోసపోయి ఆత్మహత్యకు పాల్పడిన ఉమామహేశ్వరి కుటుంబానికి ఇంకా న్యాయం జరగలేదన్నారు.
వీరందరికీ న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందన్నారు.
.