చిత్తూరు జిల్లాలో నవంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు 36,295 మంది రైతులకు చెందిన 11,368 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, ఇందుకు సంబంధించి రూ.17.29 కోట్ల పెట్టుబడి రాయితీ మంజూరు కొరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించడమైనదని జిల్లా సంయుక్త కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) పి. రాజాబాబు ఒక ప్రకటన లో తెలిపారు.
దెబ్బతిన్న పంటల వివరాలను సంబంధిత రైతు భరోసా కేంద్రాల సిబ్బంది ద్వారా అంచనా వేసి, మండల వ్యవసాయాధికారి మరియు తహశీల్దార్లు ఆమోదించిన రైతు వారీ పంట నష్ట వివరాల జాబితాను రైతు భరోసా కేంద్రాలలో సామాజిక తనిఖీ నిమిత్తం ప్రదర్శించడమైనదని తెలిపారు.
జిల్లాలో నష్టపోయిన పంటలకు సంబంధించి 9,795 హెక్టార్ల విస్తీర్ణంలో 31,807 మంది రైతులకు చెందిన వరి పంట, 501 హెక్టార్లలో 1,187 రైతులకు చెందిన వేరుశనగ పంట, 70 హెక్టార్లలో 196 మంది రైతులకు చెందిన చెరకు ఉన్నాయన్నారు.
అలాగే 133 హెక్టార్లలో 441 మంది రైతులకు చెందిన రాగి, 21 హెక్టార్లలో 66 మంది రైతులకు చెందిన కంది పంట, 166 హెక్టార్లలో 402 మంది రైతులకు చెందిన మొక్కజొన్న, 6 హెక్టార్లలో 20 మంది రైతులకు చెందిన ఇతర పంటల నష్టం జరిగిందన్నారు.
అలాగే 1274 మంది రైతులకు చెందిన 440 హెక్టార్లలో ఇసుక మేటలు, 236 హెక్టార్లలో 902 మంది రైతులకు చెందిన నేల కోత ద్వారా నష్ట వాటిల్లిందియని జాయింట్ కలెక్టర్ తెలిపారు.
Discussion about this post