శ్రీకాళహస్తిని రెవెన్యూ డివిజన్ చేసి సత్యవేడు నియోజకవర్గంలోని ఏడు మండలాలను కలపాలని టిడిపి, సిపిఐ పార్టీ నాయకులు డిమాండు చేశారు.
ఈ మేరకు వారు సోమవారం తహసీల్దార్ చంద్రశేఖర్ నాయుడుకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మండల టిడిపి పార్టీ అధ్యక్షుడు సుధాకర్ నాయుడు, సీపీఐ ఏరియా కార్యదర్శి కత్తి రవి మాట్లాడుతూ ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీకాళహస్తి డివిజన్ అయితే సత్యవేడు నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు.
ప్రభుత్వ నిర్ణయం మేరకు నాయుడుపేట అయితే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందన్నారు.
అదేవిధంగా రవాణా సౌకర్యం కూడా ఇబ్బందిగా మారుతుందన్నారు. వైసీపీ ప్రతినిధులు విజ్ఞతతో ఆలోచించి ప్రజలకు అందుబాటులో ఉండే శ్రీకాళహస్తి ని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మేదర కార్పొరేషన్ మాజీ చైర్మెన్ సుందరయ్య, తిరుపతి టీడీపీ పార్లమెంటరీ నియోజక వర్గం కార్యదర్శి సముద్రాల సుధాకర్ నాయుడు, సీపీఐ జిల్లా నాయకులు కత్తి ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు.
.