• About Us
  • Contact Us
  • Our Team
Wednesday, September 16, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

లోపలిమాట : ఎందుకీ మిడిసిపాటు?

admin by admin
July 10, 2022
0
లోపలిమాట : ఎందుకీ మిడిసిపాటు?

తనపైకి రాళ్లు రువ్వినా, పైకెక్కి తొక్కినా, తనలో వికసించిన మొగ్గలను తుంచినా దేనికీ చలించకుండా ప్రేమతో పండ్లను, పుష్పాలను, చల్లని నీడను అందిస్తాయి వృక్షాలు.

ఎవరు అడిగినా, అడగకపోయినా పురివిప్పి నాట్యంచేసి  నయనానందకరం చేసి తన షడ్జమస్వరంతో పరవశింప చేస్తుంది నెమలి.

తను నల్లగా ఉన్నా కలతచెందకుండా కమ్మని గాత్రంతో సృష్టిలోని సకల జీవులకు వినసొంపైన పంచమస్వరాన్ని వినిపించి మధురానుభూతిని కలిగిస్తుంది కోకిల.

తనకు అనంతమైన సామ్రాజ్యమున్నా ఏ మాత్రం అహంకార ఛాయలు చూపకుండా ప్రశాంతమైన చిత్తముతో మనపైకి వర్షామృత బిందువులు కురుపిస్తుంది సముద్రం.

అనంతకోటి బ్రహ్మాండంలో అవిశ్రాంతంగా అడుగులు వేస్తున్నా అలసట చెందక వినమ్రతతో, విధిగా ఏ ఫలాపేక్ష లేకుండా మనకు వెలుతురును, వేడిని, చల్లదనాన్ని అందిస్తాయి స్వయం ప్రకాశకాలైన నక్షత్రాలు, అప్రమేయంగా చలించే గ్రహాలు.

తనపైకి ఉమ్మినా, తనలోకి రంధ్రాలు దించినా, తనమొహం పైకి  విషపు గుళికలు గుమ్మరించినా మధనపడకుండా, విసుగుచెందకుండా, సహనంతో మనకు ఆహారాన్ని అందిస్తోంది పుడమి తల్లి.

శ్వాస ఆగిపోతుందేమోనని గాలి, గొంతెండిపోతుందేమోనని నీరు, చీకటి ఆవహిస్తుందేమోనని నిప్పు, పట్టుతప్పి నడక సడలిపోతుందేమోనని పుడమి, ఆనంతమైన ఆనందం ఆవిరైపోతుందేమోనని ఆకాశం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి నిరంతరం నీడవలె మన వెంటే ఉండి మనల్ని సంరక్షిస్తుంటాయి.

సృజనాత్మకత, సహజ సంపద, సౌందర్యం, సహనం, సేవాగుణం, తదితర ప్రత్యేక లక్షణాలున్న వృక్షాలు, పక్షులు, పంచభూతాలు ఏమాత్రం మిడిసిపడకుండా వినమ్రతతో, విధేయతతో, నిస్వార్థంతో, బాధ్యతతో, మౌనంగా సకలసృష్టికి ఉపయోగపడుతుంటే…

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలతో ప్రకృతిపై విషం చిమ్ముతూ వినాశనానికి పాల్పడడమే కాకుండా, ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ సాటి జీవులకు హాని కలిగిస్తూ వికటాట్టహాసం చేస్తున్నాడు మనిషి.

అసలు రెప్పపాటు…
పంచభూతాలు స్తంభించినా, పుడమి తల్లి ప్రకోపించినా, సముద్రం ఉప్పొంగినా, వృక్షాలు పత్ర, పుష్ప, ఫలాలు ఇవ్వకపోయినా, పశుపక్షాదులు సహకరించపోయినా క్షణంపాటు భువిలో మనుగడ సాగించలేడు మనిషి.

ఏ ప్రత్యేకతలు లేని, ఎవరికీ ఉపయోగపడని, అల్పజీవి అయిన ఓ అర్భకుడా!

ఎందుకీ మిడిసిపాటు?

…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159

Tags: deviprasad obbulopalimataobbu deviprasadobbu prasadproudwhy being proud
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

‘యుద్ధాలు బలికోరేది మానవత్వాన్నేనా?’

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

చాగంటి ప్రసాద్: యతో కృష్ణ స్తతో జయః

సురేష్ పిళ్లె: ఘనీభవన స్థితి ‘కడెవర్ భారతి’

16 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply