శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దని భారతీయ జనతా పార్టీ నేతలు అన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార మీడియా ప్రతినిధి కోలా ఆనంద్ కుమార్ సూచనల మేరకు మంగళారం వారు ముక్కంటి ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజును కలసి వినతితపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం నాగ పడగల కొరత ఏర్పడటం బాధాకరమన్నారు. ఆలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని వారు ఆరోపించారు. రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు చేసుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారన్నారు.
శివుని అత్యంత ప్రీతి పాత్రకరమైన రోజు అయిన సోమవారం రోజున భక్తులు మరింత ఎక్కువ మంది వస్తుంటారని.. ఆ విషయం తెలిసినా తగినన్ని నాగపడగలు అందుబాటులో ఉంచక పోవడం బాధాకరమన్నారు. నాగపడగలు తగినన్ని లేక పోవడంతో హుండీల్లో ఉన్న నాగపడగలు తీసి భక్తులకు ఇవ్వడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నించారు.
ఇలా చేయడం భక్తుల మనోభావాలు దెబ్బతీయడమేనని వారు అభిప్రామపడ్డారు. ఇలా చేసిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని వారు హెచ్చరించారు. మంగళవారం కూడా రాహు-కేతు పూజలకు నాగపడగల కొరత ఏర్పడినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
రాహు-కేతు పూజల్లో రూ.500/-తప్ప., మిగతా జరిగే పూజలు రూ.1500/- రూ.2500/- రూ.5000/- వచ్చినటువంటి భక్తులకు నాగపడగలు అందించకపోవడం చాలా దౌర్భాగ్యం అన్నారు. ఈ ఘటనకు భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ చింతిస్తున్నట్లు చెప్పారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే రీతిలో ఈరోజు శ్రీకాళహస్తీశ్వర ఆలయ అధికారులు చోద్యం చూస్తూ.. నిస్సహాయ స్థితిలో ఉండడం చాలా దురదృష్టకరమన్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని… లేక పోతే తాము పోరాటాలు చేస్తామని తెలియజేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు కాసరం రమేష్, ప్రధాన కార్యదర్శి వజ్రంకిషోర్, సీనియర్ నాయకులు చిలక రంగయ్య, సొత్తా సుకుమార్, ఓబీసీ పట్టణ అధ్యక్షులు కన్నా వెంకటేశ్వర్లు, వాసు యాదవ్, ఢిల్లీ బాబు, ఎల్. గోపాల్, చెంగల్ రాయల్ రెడ్డి, పద్మజా వాణి, పట్టణ యువ మోర్చాఅధ్యక్షులు హరీష్, పట్టణ యువ మోర్చా ప్రధాన కార్యదర్శి భరత్ నాయుడు, పట్టణ యువమోర్చా ఉపాధ్యక్షులు రవి, ఢిల్లీ, రమేష్ నాయుడు, బాలగురవయ్యయాదవ్, బాల రాజా, తదితరులు పాల్గొన్నారు.
.