మీరు ఒక ఉద్యోగం నుండి మరో ఉద్యోగానికి మారితే పాత ఉద్యోగానికి సంబంధించిన పి.ఎఫ్. డబ్బును కొత్తగా చేస్తున్న ఉద్యోగానికి సంబందించిన పి.ఎఫ్.ఖాతాకు బదిలీ చేసుకోవాలంటే ఇప్పుడు చాలా సులభం. మీరు దీనిని గురించి ఎలాంటి టెన్షన్ పడాల్సిన పలిలేకుండా సులభంగా డబ్బు బదిలీకి సంబంధించి ఈపీఎఫ్ సంస్థ చక్కటి నిర్ణయాన్ని తీసుకుంది.
ఇప్పుడు ఉద్యోగులు పలు సంస్థలు మారుతుంటారు. అయితే వారికి ఒక సంస్థనుండి మరో సంస్థకు మారిన సమయంలో పాత సంస్థలో తమ పి.ఎఫ్.ఖాతానుండి సొమ్మును కొత్త సంస్థకు బదిలీ చేసుకోవడం అనేది కాస్త ఇబ్బంది కలిగించేది. కానీ ఇకపై ఇలాంటి ఇబ్బందులకు తెరదించుతూ ఈఫీఎఫ్ సంస్థ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
ఈపీఎఫ్ సంస్థ దీనికి సంబంధించి సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్సుడు కంప్యూటింగ్ అనే సంస్థ అభివృద్ధి పరచిన కేంద్రీయ వ్యవస్థను ఆమోదించింది. దీనిద్వారా ఉద్యోగులు తాము ఎన్ని ఉద్యోగాలు మారినా వారి పీఎఫ్ ఖాతా నంబరు అదే కొనసాగుతుంది.
Also read : క్రెడిట్ డెబిట్, క్రెడిట్ కార్డు ఉందా.. ఈ లాభం గురించి తెలుసా?
ఈపీఎఫ్ సంస్థ తీసుకున్న ఈ కీలక నిర్ణయం ద్వారా సెంట్రల్ డేటాబేస్ ద్వారా పీఎఫ్ ఖాతాలకు సంబంధించి మరింత మెరుగైన సెవలను అందించడానికి, తద్వారా కార్యక్రమాలు సాఫీగా సాగడానికి వీలవుతుంది. అంతేకాదు ఈ వ్యవస్థ ద్వారా పీఎఫ్ ఖాతాల డూప్లికేషన్ ను నివారించడంతోబాటు పీఎఫ్ ఖాతాల విలీనాన్ని కూడా సులభతరం కానుంది.
సీ డాక్ ద్వారా అభివృద్ధి పరచిన ఈ కేంద్రీకృత వ్యవస్థను ఆమోదించినట్లు ఈపీఎఫ్ సంస్థ తెలుపుతూ ‘‘ఈ విధానంద్వారా పనులు సజావుగా, దశలవారీగా ముందుకు సాగుతాయని, అలాగే పీఎఫ్ ఖాతాలలో ఫండ్స్ ని బదిలీ చేయడానికి, ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలను అందించడానికి, ఒకే వ్యక్తి రెండు మూడు పీఎఫ్ ఖాతాలను కలిగి ఉండడడం వంటి వాటిని నిరోధించడానికి ఇది మరింతగా ఉపకరిస్తుంద’’ని రిటైర్మెంట్ ఫండ్ బాడీ పత్రికాముఖంగా వెల్లడించింది.
Also read : 20 నిమిషాల్లో 3.1 లక్షల టికెట్లు బుకింగ్
ఉద్యోగుల ద్వారా పొదుపు చేయబడే ప్రావిడెంట్ ఫండ్, మరియు ఫెన్షన్ ఫండ్స్ ను కొత్త వ్యాపారాలలో పెట్టుబడులుగా పెట్టేలా నిర్ణయాలను తీసుకునేలా ఫైనాన్స్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఆడిట్ కమిటీకి అధికారం కల్పించాలని ఈ సందర్భంగా ఈపీఎఫ్ సంస్థ నిర్ణయించింది.
అలాగే ఈ పీఎఫ్ లోని ద్రవ్యాన్ని భారత ప్రభుత్వం గుర్తించిన పలు వ్యాపారాలలో పెట్టుబడులుగా పెట్టేందుకుగాను ఫైనాన్స్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఆడిట్ కమిటీకి అధికారం ఇవ్వాలని ఈ సందర్భంగా ఈపీఎఫ్ సంస్థ బోర్డు నిర్ణయించింది.
అంతేకాకుండా ఈపీఎఫ్ సంస్థ అదనంగా మరో నాలుగు సబ్ కమిటీలను దీనికింద ఏర్పాటు చేయాలని, ఇందులో ఉద్యోగుల బోర్డు సభ్యులు, మరియు యజమానుల పక్షాల సభ్యులతోబాటు ప్రభుత్వ ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉంటారని, సంస్థలకు సంబంధించిన అన్ని విషయాలపై ఈ కమిటీలు సామాజిక భద్రతా అమలు కార్మిక ఉపాధి మంత్రి అధీనంలో ఉంటాయని సంస్థ తెలిపింది.
ఇందులో డిజిటల్ బిల్డింగ్ మరియు సామాజిక భద్రతా అమలు వంటి అంశాలు కార్మిక ఉపాధి మంత్రి అధీనంలో ఉంటాయి. ఈ విషయాన్ని ఈపీఎఫ్ సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కు సంబంధించిన 229వ సమావేశంలో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వెల్లడించారు.
.

Discussion about this post