పాఠశాలలల్లో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనరు బాలాజీ నాయక్ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం శ్రీకాళహస్తి పట్టణ పరిధిలో పలు ప్రైవేటు పాఠశాలలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా బాలాజీ నాయక్ మాట్లాడుతూ… ప్రస్తుతం కొవిడ్ మూడవ దశ ఉధృతంగా ఉందన్నారు. శ్రీకాళహస్తిలో కూడా నిత్యం పెద్ద సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయన్నారు.
ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్ లను తప్పక ఉపయోగించాలన్నారు.
ప్రతి ఒక్కరూ భౌతిక దూరమును పాటించాలని…పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు.
18 సంవత్సరాల లోపు వారు ఇంకా వ్యాక్సిన్ వేయించుకోక పోతే…వారు వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు.
లక్షణములు ఉన్న వారు వెంటనే సమీప ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షించుకోవలసినదిగా తెలియజేశారు.
Discussion about this post