తిరుమల శ్రీవారి ఆలయం పక్కన గల లడ్డూ కౌంటర్ల వద్ద భక్తురాలు పోగొట్టుకున్న ఒక బంగారు గాజును టిటిడి నిఘా మరియు భద్రతా సిబ్బంది గుర్తించి తిరిగి అప్పగించారు.
బెంగళూరుకు చెందిన వి.వెంకటేష్ అనే భక్తుడు తన భార్యతో కలిసి సోమవారం శ్రీవారి దర్శనానికి వచ్చారు.
దర్శనానంతరం లడ్డూ కౌంటర్ల వద్ద ఆమె బంగారు గాజును జారవిడుచుకున్నారు. ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న హోమ్‌గార్డ్ నరేష్ బంగారు గాజును గుర్తించి బయోమెట్రిక్ వద్ద అప్పగించారు.
ఒక గంట తరువాత పోగొట్టుకున్న భక్తులు వెంకటేష్ దంపతులు లడ్డు కౌంటర్ వద్ద బంగారు గాజు కోసం వెతుకుతుండగా భద్రతా సిబ్బంది గుర్తించారు.
సిసిటివి ఫుటేజిని పరిశీలించి తగిన గుర్తులను నిర్ధారించుకున్నాక 25 గ్రాముల బంగారు గాజును(సుమారు రూ.100,000/-) భక్తులకు అప్పగించారు.
విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించిన హోమ్‌గార్డ్ నరేష్‌ను భద్రత అధికారులు అభినందించారు.
.

Discussion about this post