• About Us
  • Contact Us
  • Our Team
Monday, August 24, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

Good Morning : keep rocking అనిపించుకోవాలంటే..

admin by admin
February 3, 2022
0
Good Morning : keep rocking అనిపించుకోవాలంటే..

అద్భుతాలు చేయాలనేది అందరి స్వప్నం. మన్ను తిన్న పాములా పడి ఉండి యావజ్జీవితమూ గడిపేయాలని ఏ ఒక్కరూ అనుకోరు. తాము గొప్ప పనులు చేయాలనే ఆశిస్తారు.. తమకు గొప్పవాళ్లుగా గుర్తింపు కావాలనే అనుకుంటారు. మరి గొప్ప పనులు చేయడం ఎలా? ప్రపంచంలో అందరికీ సరిపోయేంతగా గొప్ప పనులు ఎక్కడ ఉంటాయి?

గొప్ప పనులు అనేవి విడిగా, ప్రత్యేకంగా ఉండవు. చేసే పనుల్లోనే కొన్ని గొప్పవిగా తయారవుతాయి. చేసేవారిని గొప్పవాళ్లుగా ఆవిష్కృతం చేస్తాయి. తొలుత పనిచేయడం ప్రారంభిస్తే, చేస్తూ ఉంటే.. చేయడంలో శ్రద్ధ, పరిణతి, నైపుణ్యాలు మెరుగుపడడం వలన.. ఆ చేసే పని ఏదో ఒక నాటికి గొప్పది అవుతుంది.

భగవద్గీత కర్మయోగంలో మనలో కార్యశీలతను ప్రేరేపించే ఒక అద్భుతమైన శ్లోకం ఉంటుంది.

నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హి అకర్మణః
శరీర యాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేత్ అకర్మణః

నువ్వు నిత్యం పని చేస్తూ ఉండు. ఏ పనీ చేయకుండా నిర్వ్యాపారంగా ఉండడం కంటే.. ఏదో ఒక పని చేస్తూ ఉండడం చాలా గొప్పసంగతి. ఏ పనీ చేయకుండా ఉంటే.. నీ దేహయాత్ర.. శరీరాన్ని పోషించుకోవడం కూడా కష్టమే. (భగవద్గీత కర్మయోగం 3-8)

Keep rocking అనేది ఆధునికతరం యువత జీవనవేదంగా మారుతోంది. అద్భుతాలు చేస్తూ ఉండు.. సంచలనాలు చేస్తూ ఉండు.. గొప్ప పనులు చేస్తూ ఉండు.. అని యువతరం ఒక జీవన సూత్రాన్ని నిర్దేశించుకుంటున్నారు. Look up your aim high తరహాలో ‘పెద్ద కలలు కనండి’ అని అబ్దుల్ కలాం చెప్పినట్లుగా keep rocking అనే జీవన సూత్రం కూడా చాలా గొప్పదే. ఇలాంటి కలలు ఉండడం మంచి విషయమే.

కానీ దానికంటె ముందుగా పాటించాల్సిన మౌలిక సూత్రం keep doing. ఏదో ఒక పనిచేస్తూ ఉండాలి. Keep rocking అనేది ఒక అత్యద్భుతమైన రమ్యమైన భవనం అనుకుంటే.. keep doing అనేది ఆ భవనానికి పటిష్టమైన పునాది! భవనం పూర్తయ్యాక దాని అందంలో ఎప్పటికీ కనిపించకుండా, నేలకింద ఉండిపోయే పునాది దగ్గరే.. ఎప్పుడైనా సరే అసలు పని మొదలవుతుంది.

గొప్పపనులు చేయాలనే లక్ష్యం పెట్టుకోవడం మంచిదే! కానీ వాస్తవం ఏంటంటే.. ఏదో ఒక పని చేస్తూ ఉంటేనే గొప్ప పనులు చేయగలం. గొప్ప పనులతోనే మొదలు పెట్టాలి.. గొప్ప పనులు వచ్చినప్పుడు చేయాలి.. అనుకుంటే ఎప్పటికీ అడుగు ముందుకు వేయలేం.

నిర్వ్యాపారత్వం మృత్యులక్షణం. మనిషన్నాక ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. అది ఉపయోగపడే పని అయితే ఇంకా మంచిది. రామకృష్ణ పరమహంస వద్దకు ఓ సోమరి వచ్చాడట. తనకు ఏదైనా ఉపదేశం చేయమని అడిగాడు. ఏ పని చేయగలవు అంటే.. ఏదీ చేతకాదు, చేయలేను, ఏ నైపుణ్యాలూ లేవు అని అన్నాడుట. ‘కనీసం దొంగతనమైనా చేయగలవా?’ అని అడిగాడుట రామకృష్ణ పరమహంస.

అంటే, ఇందులోని మర్మం ఏంటంటే.. ఏ పనీ చేయకుండా సోమరిగా ఉండడం కంటె.. దొంగపని అయినా సరే.. ఏదో ఒకటి చేస్తూ ఉండడం జీవలక్షణం. జడత్వం ఎప్పటికీ పనికిరాదు.

ఏదో ఒక పనిచేస్తూ ఉండడం ఎంత ముఖ్యమో.. చేసే పని మనకు ఉపయోగపడేదేనా కాదా అనే స్పృహ కలిగి ఉండడం కూడా అంతే ముఖ్యం. ఖాళీగా ఉండడం కంటె ఏదో ఒక పని- అంటే.. ఎలాంటి నైపుణ్యాలు అవసరం లేని కూలి పనికి వెళ్లడం కూడా మంచిదే. కానీ.. సివిల్స్ రాయాలని, ఐఏఎస్ చేయాలని లక్ష్యించే వ్యక్తి- ఖాళీగా ఉండకుండా కూలి పనికి వెళ్లడం కరెక్టు కాదు. కూలి పనికి వెళ్లడం కంటె లైబ్రరీకి వెళ్లి పేపర్లు చదువుతూ గడపడం మంచిది. ఆ పనిలో క్రియాశీలంగా ఏమీ కనిపించకపోయినా.. కనీసం తన లక్ష్యానికి దగ్గర చేసేలా.. అతని జ్ఞానం కొంత వృద్ధి చెందుతుంది.

అంటే.. ఏదో ఒక పనిచేయడం, జడత్వం లేకుండా ఉండడం ఎంతో అవసరం! ఉదరపోషణకు ఇది సరిపోతుంది. కానీ మనకు ఒక లక్ష్యం ఉన్నప్పుడు- మనం చేస్తున్న పని.. ఎంత చిన్నది అయినా సరే.. ఆ లక్ష్యానికి ఒక మిల్లీమీటరు, సెంటీమీటరు అయినా చేరువ చేసేదిగా ఉంటే.. అది ఇంకా గొప్ప సంగతి.

Keep rocking అనే దశను చేరుకోవడం ఏమాత్రం కష్టం కాదు.. కానీ, keep doing అనే దశ దగ్గర ప్రతి ఒక్కరి ప్రస్థానం మొదలు కావాలి.

శుభోదయం.

Tags: BhartrihariBhartrihari subhashithamgood morninggood morning thoughtquotes on good thoughtssubhashitamsubhashithamభర్తృహరి సుభాషితంమంచిమాటశుభోదయంసుభాషితం
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

9 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply