• About Us
  • Contact Us
  • Our Team
Sunday, September 6, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

Good Morning : ఏది ప్రశంస- ఏది పొగడ్త?

admin by admin
December 15, 2021
0
Good Morning : ఏది ప్రశంస- ఏది పొగడ్త?

ఎవరైనా మంచి పని చేసినప్పుడు, ప్రతిభను ప్రదర్శించినప్పుడు వారిని అభినందన పూర్వకంగా ప్రశంసించడం చాలా అవసరం. వారు వారి ప్రతిభలను మరింతగా మెరుగు పెట్టుకోడానికి వారికి ఆ ప్రశంస ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. అయితే పొగడ్త కూడా ప్రశంసేనా?!

ప్రశంసకు భ్రష్టరూపం పొగడ్త అనుకోవాలి. ప్రశంస అనేది ప్రతిభ ఉన్న వారికి ఉత్సాహాన్ని ఇస్తే.. పొగడ్త అనేది వారి ప్రతిభను చంపేస్తుంది. వారి అహంకారాన్ని పెంచి వారిని నాశనం చేసేస్తుంది. అయితే ఈ ప్రశంస- పొగడ్త మధ్య ఉండే విభజన రేఖ చాలా సున్నితమైనది. దాన్ని పట్టుకోవడం, ఆ గీతను దాటకుండా ఉండడం చాలా కష్టం.

ప్రశంస అనేది టానిక్ లాంటిది.. పొగడ్త అనేది విస్కీ లాంటిది. ఒకటి ఆరోగ్యాన్ని కుదుటపరిస్తే.. రెండోది సర్వనాశనం చేసేస్తుంది. లేని ప్రతిభలను గురించి ప్రశంసిచడం చాలా ఘోరమైన పొగడ్త కింద లెక్క.

పొగడ్తలు- ప్రశంసల మధ్య వ్యత్యాసాల గురించి కాకపోయినా.. లేనివాటిని గురించి చేసే పొగడ్తల గురించి.. ఓ మంచి సుభాషితం ఉంది..

ఉష్ట్రాణాం చ వివాహేషు గీతం గాయంతి గర్దభాః
పరస్పరం ప్రశంసంతి అహో రూపం అహో స్వరం

ఒంటెలు పెళ్లి చేసుకుంటూ ఉంటే.. అక్కడ గాడిదలు సంగీత కచేరీ పెట్టాయట. ఇద్దరూ పరస్పరం పొగుడుకున్నారు. ‘అబ్బో ఎంత అందం’ అని ఒంటెల గురించి గాడిదలు అంటే.. ‘ఆహా.. ఎంత తియ్యగా పాడారు’.. అని గాడిదల కచేరీ గురించి ఒంటెలు కీర్తించాయిట.  -ఇదీ శ్లోకభావం.

you scratch my back, i scratch you back అని ఇంగ్లిషులో ఒక నానుడి ఉంటుంది. ఒకరినొకరు పొగడుకోవడానికి సంబంధించిన వెటకారం ఇది. అంతూ దరీ లేకుండా.. ఒకరిలో లేని ప్రతిభలను కూడా ఆపాదిస్తూ, ఆకాశానికెత్తేస్తూ పొగిడే బాపతు వాళ్లు మనకు అనేకులు కనిపిస్తూ ఉంటారు. సాహిత్య సమావేశాల్లో ఇలాంటివి అనేకం. సినిమా వాళ్ల ప్రమోషన్ సభల్లో కూడా ఇలాంటి పరస్పర కీర్తనలు పుష్కలంగా కనిపిస్తాయి.

ఆ స్థాయిని దాటి.. ఒంటెల అందాలను, గాడిదల గానాన్ని కూడా కీర్తించే తరహా పొగడ్తలు కావాలంటే.. మనం రాజకీయ నాయకుల సభలు చూడాల్సిందే. ఇద్దరు నాయకులు వేదిక మీద ఉంటే.. చూడాలి తమాషా. వారు సమాన స్థాయి అయిఉంటే ఈ వినోదం దక్కదు. నిజంగా ప్రతిభావంతుల్ని కూడా సమస్థాయి వారు మెచ్చుకోలేరు. ఒక నాయకుడు, ఒక అనుచరుడు వేదిక మీద ఉంటే అసలైన వినోదం.

EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి

ఇద్దరూ పరమ ధూర్తులని, దుర్మార్గులని, నికృష్టులని కూడా.. ప్రజలకు అర్థమవుతూనే ఉంటుంది. స్పష్టంగా అందరికీ తెలిసిన సంగతే. అయినా సరే.. ఆ ఇద్దరూ ఒకరి గురించి మరొకరు.. వీరలెవల్లో పొగడ్తలు కురిపించేస్తుంటారు. ఆ పొగడ్తలను ఎలాంటి వెరపు లేకుండా, సిగ్గు లేకుండా ఇరువురూ ఆస్వాదిస్తూ ఉంటారు కూడా.

ప్రతిభ ఉన్న వారిని మెచ్చుకోవడం, భుజం తట్టి ప్రశంసించడం అవసరమే. కానీ.. ఆ ప్రయత్నంలో పరమ ధూర్తుల్నికూడా పొగిడే పని తప్పు. అలా పొగడాలని అనిపించినప్పుడు.. ఒక విషయం గుర్తుంచుకోవాలి.. ఒంటె అందాన్ని పొగడడానికి పూనుకుంటే మనం గాడిద అయిపోతాం..!

శుభోదయం.

Tags: beauty of camelBhartrihariBhartrihari subhashithamgood morninggood morning thoughtquotes on good thoughtssubhashitamsubhashithamsweetness in voice of donkeyభర్తృహరి సుభాషితంమంచిమాటశుభోదయంసుభాషితం
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

2.8.26 కథానిధి సమీక్ష: సామాజిక వాస్తవికతకు అక్షర దర్పణం

9 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

సురేష్ పిళ్లె: ఘనీభవన స్థితి ‘కడెవర్ భారతి’

02 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply