ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రాణాలను బలిగొంటోంది. ప్రాజెక్టులు కట్టడానికి, కాంట్రాక్టు పనులు చేపట్టడానికి ఉండే శ్రద్ధ ప్రభుత్వాలకు ఆ ప్రాజెక్టుల వల్ల బతుకులు దుర్భరంగా మారిపోయిన ప్రజలను ఆదుకునేందుకు ఉండకపోవడం ప్రతిసారీ జరిగేదే. ప్రాజెక్టు ఒక ప్రాంతాన్ని ముంచేసే పరిస్థితి ఉంటే.. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించి.. ప్రజలకు మరోచోట పునరావాసం కల్పించడం కొత్త కాదు. కానీ.. ఆ నిర్వాసితులకు ఇవ్వవలసిన పరిహారం చెల్లింపుల్లో మాాత్రం ప్రభుత్వాలు చాలా సార్లు దారుణంగా వ్యవహరిస్తుంటాయి.
తాజాగా కడపజిల్లా తాళ్ల ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన చాకలి అంకాలయ్య ఆత్మహత్యకు కూడా.. ఇలాంటి సర్కారీ నిర్లక్ష్యమే కారణం కావడం విశేషం. గండికోట ప్రాజెక్టు కింద ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ డబ్బులు రాలేదని అంకాలయ్య కొన్నాళ్లుగా మనస్తాపంతో మధనపడుతున్నాడు.
కొండాపురం సమీపంలోని ముచ్చుమర్రి పునరావాసం కేంద్రం వద్ద రైలు కింద పడి మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందులతో, సర్కారా కాంపెన్సేషన్ కూడా అందని నేపథ్యంలో దిక్కుతోచక ఆత్మహత్య చేసుకొన్నట్లు భార్య విలపిస్తోంది.
ఇవి సర్కారీ హత్యలు కావా?
ఇలాంటి మరణాలు సంభవించినప్పుడు.. తమ వైఫల్యాల మీద ప్రజల దృష్టి పడకుండా వారి కళ్లు కప్పడానికి ప్రభుత్వాలు.. ఏదో పరిహారం ఇవ్వడం సహజంగా జరిగేదే. కానీ.. వాస్తవంలో.. వారు చెల్లించాల్సినది సక్రమంగా చెల్లించకపోవడం వల్లనే.. ఇలాంటి మరణాలు సంభవిస్తున్నాయనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. ఇలాంటి ఆత్మహత్యలను, వాస్తవంలో సర్కారీ హత్యలుగానే పరిగణించాల్సి ఉంటుందనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి.
ఇదీ చదవండి :
పీవీ శతజయంతి సందర్భంగా.. కేంద్ర ఘన నివాళి ఇలా?
.

Discussion about this post