భారతదేశానికి కొత్త రాజ్యాంగం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రజాజీవితంలో యాభయ్యేళ్ల సుదీర్ఘ ప్రస్థానం సాగించిన వ్యక్తిగా.. దేశానికి కొత్త రాజ్యాంగం అవసరం ఉన్నదని తాను బలంగా నమ్ముతున్నానని అన్నారు. రాజ్యాంగం రాష్ట్రాలకు ప్రసాదించిన హక్కులను కేంద్రం హరించి వేస్తున్నదని.. రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్ర ప్రభుత్వం అధికారులు, పరిధులను స్పష్టంగా నిర్దేశించేలా కొత్త రాజ్యాంగం అవసరం ఉన్నదని అన్నారు.
భారత్.. అమెరికా కంటె కూడా పెద్ద ఆర్థిక శక్తిగా ఎదగగలదని, ప్రపంచంలో ఎక్కడా లేనంత యువశక్తి మన దేశంలో ఉన్నదని అన్నారు.
మనదేశంలో ఇప్పటికే రాజ్యాంగానికి 80 సార్లకు పైగా సవరణలు చేసుకున్నామని, సవరణలు కాకుండా పూర్తిగా కొత్త రాజ్యాంగాన్నే తయారు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు.
ప్రపంచంలో అనేక దేశాలు అవసరమైన సందర్భాల్లో తమ దేశాల రాజ్యాంగాలను తిరగరాసుకున్నాయని అన్నారు. మనదేశానికి కొత్త రాజ్యాంగం కావాలనే ప్రతిపాదన దేశం ముందు పెడుతున్నానని.. దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉన్నదని కేసీఆర్ అన్నారు.
.

Discussion about this post