గులాబీ- కమల దళాల మధ్య ప్రతిష్ఠాత్మక సమరానికి తెరలేసింది. తెలంగాణ రాజకీయాల్లో ఎంతో కీలకంగా అందరూ పరిగణిస్తున్న ఈ ‘పుష్ప సమరం’తో అక్టోబరు నెల మొత్తం.. ఒక్క హుజూరాబాద్ మాత్రమే కాకుండా.. తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వేడి పెరగనుంది.
హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
హుజూరాబాద్ ఎన్నికను తెరాస, బీజేపీ పార్టీలు చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. తెరాస నంచి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీకి జరుగుతున్న ఉపఎన్నికలో ఆయనను ఎలాగైనా సరే ఓడించాలని అధికార పార్టీ సర్వశక్తులను ఒడ్డుతోంది. హరీష్ రావు.. కొన్ని నెలలుగా హుజూరాబాద్ లోనే తిష్ట వేసి అక్కడి రాజకీయాలను శాసించాలని ప్రయత్నిస్తున్నారు.
ఈటల రాజేందర్ కూడా ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. తన విజయంతో తెలంగాణ వ్యాప్తంగా అధికార పార్టీకి ప్రతికూల పవనాలు మొదలయ్యాయని నిరూపించాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. బీజేపీ నాయకులు మొత్తం.. ఈ ఎన్నికలో ఎలాగైనా నెగ్గాలని తపన పడుతున్నారు.
ఇలాంటి పరిణామాల మధ్య హుజూరాబాద్ ఎన్నిక సహజంగానే వేడెక్కుతోంది.
హుజూరాబాద్ ఎన్నికలకు సంబంధించిన పూర్తి ప్రక్రియ ఇలా ఉండబోతోంది:
అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల.
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8.
అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన.
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13.
అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్.
నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన.
.

Discussion about this post