• About Us
  • Contact Us
  • Our Team
Friday, August 14, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

జగన్ కల.. ఇప్పట్లో తీరే చాన్స్ లేదా?

అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి కన్నటువంటి అనేక కలలను చాలా కొద్దికాలంలోనే తీర్చేసుకున్నారు. కానీ.. ఆయన ఎంతగానో కోరుకున్న ఒక స్వప్నం మాత్రం ఇప్పట్లో నెరవేరే అవకాశం కనిపించడం లేదు.

admin by admin
March 27, 2021
0
bjp raju fires on ys jagan

bjp raju fires on ys jagan

అధికార వికేంద్రీకరణ ద్వారా.. పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన. మూడు రాజధానుల ఆలోచన చెప్పినప్పటికీ.. అందుకే మూల కారణంగా ఆయన చెబుతున్నది ఇదే. ఇదే తరహా పాలన వికేంద్రీకరణలో భాగంగానే.. చిన్న జిల్లాల ఏర్పాటు కూడా ముఖ్యమంత్రి ప్రధాన ఆశయాల్లో ఒకటిగా ఉంది. తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే.. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పాదయాత్రలో ఆయన ఈ మేరకు ఒక కీలక ప్రకటన చేశారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తానని ఆయన ప్రకటించారు. జిల్లా సంఖ్య కొంత పెరిగింది గానీ.. చిన్ని జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన కసరత్తును కూడా ఆల్రెడీ ప్రారంభించారు. తొందర్లోనే కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తయిపోతుందనే మాట కూడా ఇటీవలి వరకు వినిపించింది. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల పునర్విభజన అనేది మరో ఏడాదిన్నర, రెండేళ్ల వరకు సాధ్యం కాకపోవచ్చునని తెలుస్తోంది.

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు తాత్కాలికంగా బ్రేక్ పడే అవకాశం ఉందనే వాదన ఇప్పుడు తెరపైకి వచ్చింది. 2021 జనాభా లెక్కలు జిల్లాల పునర్విభజనకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఆర్టీఐ దరఖాస్తుతో వెలుగులోకి వచ్చిన వివరాలనుబట్టి ఇలాంటి అనుమానం కలుగుతోంది. జనాభా లెక్కలు పూర్తయ్యే వరకూ జిల్లా, మండల, గ్రామ రెవెన్యూ పరిధిలో మార్పులు, చేర్పులు చేయరాదని ఇప్పటికే కేంద్రం ఆదేశాలున్నాయని ఆర్టీఐ ద్వారా బయటకు వచ్చింది. దీంతో.. దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ పూర్తయ్యేవరకూ ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ఆగిపోవచ్చు. గత ఏడాది జరగవలసిన జనగణనను కరోనా కారణంగా తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు అనేది మరో ఏడాదిన్నర కాలం వరకు ఆలస్యం కావచ్చునని తెలుస్తోంది.

పాదయాత్రలో ఉన్న సమయంలోనే జగన్ చిన్న జిల్లాల గురించి ప్రకటించారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని కూడా ప్రకటించి ఆ వర్గం వారిని ఆకట్టుకున్నారు. ఇటీవలి కాలంలో చిన్న జిల్లాలకు సంబంధించి కసరత్తు ప్రారంభించారు. అయితే.. ఆయన ప్రకటన ప్రకారం.. పార్లమెంటు నియోజకవర్గం ఒక జిల్లా కావాలి గానీ.. సహజంగానే.. ఒత్తిళ్లు పెరగడంతో.. జిల్లాల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. అనేక నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులే.. తమ ప్రాంతానికి ఒక ప్రత్యేక జిల్లా కావాలంటూ.. ఆందోళనలు చేస్తూ జగన్ ను ఒప్పించుకోగలిగారు. అయితే.. అంతగా జగన్ కలలుగన్న కొత్త జిల్లాల ఏర్పాటు అనేది.. ఇప్పట్లో అంత తొందరగా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

Tags: jagan decisionjaganmohan reddynew districts in apsmall districts
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply