చీప్ లిక్కర్ చీప్ గా అందించడం ద్వారా భారతీయ జనతా పార్టీ రాజ్యాధికారం కోరుకుంటున్న తీరుపై జనసేనాని పవన్ కల్యాణ్ గుస్సా అయ్యారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన, తన పార్టీ వారికి ఫోను చేసి.. ఈ వ్యవహారంపై పూర్తి సమాచారం తెలుసుకున్నారు. సోము వీర్రాజు నాయకత్వం భారతీయ జనతా పార్టీని భ్రష్టు పట్టించడం మాత్రమే కాదు.. వారితో రాష్ట్రంలో పొత్తు అనుబంధం కొనసాగిస్తున్నందుకు తమ పార్టీ మీద కూడా ప్రభావం చూపిస్తుందనే అంచనాకు వచ్చారు. అందుకే బీజేపీ నాయకత్వానికి ఒక ఫత్వా జారీచేశారని సమాచారం.
విశ్వసనీయంగా తెలుస్తున్న దాన్ని బట్టి వివరాలు ఇలా ఉన్నాయి. బీజేపీ పరువును దేశస్థాయిలో తీసేసిన సోము వీర్రాజుపై పార్టీ చర్య తీసుకోవాలని పవన్ కల్యాణ్ ఆశిస్తున్నారు. సోము వీర్రాజుపై పార్టీ కేంద్ర నాయకత్వం చర్యలు తీసుకోవాలనేది ఆయన డిమాండ్. సోము- పార్టీ అధ్యక్షుడు గనుక.. ఆయన మీద చర్యలు తీసుకోవడం కూడా ప్రజల్లోకి మరో తరహా సంకేతాలు పంపే ప్రమాదం ఉంటుందని వారిలో ఏమైనా సంకోచం ఉంటే గనుక.. పార్టీ నాయకులు కనీసం చీప్ లిక్కర్ ప్రకటనను ఖండించి తీరాల్సిందేనని పవన్ కల్యాణ్ కోరుకుంటున్నారు.
భారతీయ జనతా పార్టీ నుంచి సోము వీర్రాజుపై చర్యల గురించి పట్టించుకోకపోయినా, కనీసం ఖండన కూడా రాకపోయినా.. ఆ పార్టీతో బంధాన్ని కట్ చేసుకోవాలని కూడా పవన్ కల్యాణ్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి విధానాలే అనుసరించేట్లయితే.. బీజేపీతో తెగతెంపులు చేసుకోవడానికి తాము సిద్ధంగానే ఉన్నామనే సంకేతాన్ని ఏపీ ప్రజల్లోకి పంపలేకపోతే.. తమ పార్టీకి కూడా దెబ్బే అని జనసేన వ్యూహకర్తలు భావిస్తున్నారు.
Read Also : సోము : అమాయకుడా? పార్టీని పాతిపెట్టే శల్యుడా?
నిజానికి బీజేపీతో పొత్తు వలన జనసేనకు వచ్చిన లాభం ఏమీ లేదు. రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి గతంలో పోలిస్తే ఏమాత్రం మెరుగుపడిన దాఖలాలు కూడా లేవు. తమ వలన బీజేపీకి ఏమైనా లాభం ఉంటుందే తప్ప.. వారి వలన తమ పార్టీకి లాభం ఉంటుందని అనుకోవడం భ్రమ.
ఇలాంటి లెక్కలతోనే.. ఇప్పటికే పవన్ కల్యాణ్ బీజేపీ అభీష్టానికి విరుద్ధంగా.. విశాఖ ఉక్కు ప్రెవేటీకరణను నిరసిస్తూ ఉద్యమిస్తున్నారు. అలాగే అమరావతికి అనుకూలంగా కూడా పోరాడుతున్నారు. బీజేపీతో పొత్తులో ఉంటూ విశాఖ ఉక్కు మీద పోరాడడం పవన్ కల్యాణ్ కు కొంత ఇబ్బంది కలిగిస్తున్న మాట కూడా వాస్తవం.
ఈ నేపథ్యంలో.. బలాబలాల పరంగా ఏమాత్రం ఉపయోగం లేదని బీజేపీతో తెగతెంపులు చేసుకున్నా పెద్ద నష్టం లేదని వారు భావిస్తున్నారు. చీప్ లిక్కర్ చీప్‌గా ఇస్తామనే మాటల ద్వారా.. బీజేపీ తమ గోతిని తామే తవ్వుకుంటూ ఉంటే.. ఆ గోతిలో తామెందుకు పడాలనేది జనసేన వారి ఆలోచన. అందుకే.. ఈ నష్టం పూడాలంటే.. ప్రజల ఎదుట పరువు దక్కాలంటే.. సోము వీర్రాజుపై చర్యలైనా ఉండాలి? లేదా ఆ ప్రకటననైనా ఖండించాలి? అని పవన్ కల్యాణ్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
Discussion about this post