ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) సి. హెచ్. శ్రీధర్ అన్నారు.
గురువారం పలమనేరు లోని ఆర్.కె స్ట్రీట్, రంగాపురం సచివాలయం, పాత పేట, కొత్త పేట ప్రైమరీ హెల్త్ సెంటర్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలతో పాటు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన లబ్ధిదారులు లిస్ట్ పక్కాగా ఉండాలని తెలిపారు. ఇప్పటివరకు సచివాలయానికి స్పందన ద్వారా ఎన్ని అర్జీలు వచ్చాయి, ఎన్ని అర్జీలకు పరిష్కారం చూపించారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కోవిడ్-19 నేపద్యంలో ఫీవర్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని మరియు ఇప్పటివరకు ఎంతమందికి ఫీవర్ సర్వే చేశారని ప్రైమరీ హెల్త్ సెంటర్ లోని ఏఎన్ఎం మరియు ఆశా వర్కర్ లను వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పలమనేరు మునిసిపాలిటీ ఏ ఈ సచివాలయ సిబ్బంది, వైద్య సిబ్బంది తదతరులు పాల్గొన్నారు.
.