తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ భారతీయ జనాతా పార్టీ లక్ష్యంగా చేసుకొని మాటల యుద్ధం చేశారు. వరికొనుగోలు విషయంలో ప్రజల ముందు కేంద్రాన్ని దోషిగా చూపించాలని విఫల యత్నం చేస్తున్నారు. అందుకే ఢిల్లీ పర్యటన తర్వాత స్తబ్ధుగా ఉన్న ఆయన ఒక్కసారిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకొని సంచలన వ్యాఖ్యలు చేశారు.
వాస్తవానికి సీఎం మదిలో ఉన్నది రైతులపై ప్రేమేనా లేక.. తెలంగాణలో తెరాస పట్టుకోల్పోతున్నదనే ఆందోళనా? అనేది తేలాల్సి ఉంది. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత సీఎం వ్యవహారంలో భిన్నమైన మార్పులు చోటు చేసుకున్నాయి. రైతులపై ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చింది.
కానీ ఆయన మాటల వెనుక ఉన్న మర్మం మాత్రం ఒక్కటేనని స్పష్టమవుతోంది. ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీ బలమైన బీజాలను నాటుతోంది. మానును కొట్టలేము గనుక మొక్కగా ఉన్నప్పుడే తుడిచి పెట్టేయాలనే సామెతను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.
ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి తన స్థాయిని దిగజార్చుకొని పరుషమైన పదజాలం వినియోగిస్తున్నారు. అన్నదాతలను ఆదుకోవాల్సిన మంత్రి ఓ రండలా ఉన్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఎం అసహనం తారస్థాయికి వెళ్లి మాట్లాడారని ఆయన మాటల ద్వారానే తెలుస్తోంది. రారా.. పోరా అంటూ కేంద్ర మంత్రులపై వ్యాఖ్యలు చేశారు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
నిజానికి తెలంగాణ రైతులపై ప్రేమ ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా వడ్లు కొనుగోలు చేసి ఆదుకోవాల్సిన పరిస్థితి. కానీ కేంద్రం తెలంగాణ రైతులు పండించిన పంటను కొనడం లేదని చెబుతున్నారు. అసలు తూకం పోయని పంటను కొనాలని డిమాండ్ చేస్తున్న ఆదర్శ రైతు ముఖ్యమంత్రి ఈయన ఒక్కరే ఉన్నారనిపిస్తోంది.
ఓ వైపు వర్షాకాలంలో పండించిన పంటను పూర్తిగా కొనుగొలు చేయకముందే.. యాసంగి పంట కొనాలని సీఎం ఎందుకు డిమాండ్ చేస్తున్నారనేది ఇక్కడ ప్రధాన అంశం. వరి ధాన్యం బఫర్ స్టాక్ పెట్టుకోవడం కేంద్రం బాధ్యతని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని మండిపడ్డారు. తన సామాజిక బాధ్యతను కేంద్రం విస్మరిస్తోందని అన్నారు. తన విధానాలతో రైతాంగాన్ని కేంద్రం గందరగోళ పరుస్తోందని తెలిపారు. లాభ నష్టాలు బేరీజు వేసుకుంటే అది ప్రభుత్వం అవుతుందా? అని నిలదీశారు.
also read : భర్తలు కొడుతోంటే భార్యలు మురిసిపోతున్నారా?
అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఎందంటే.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పంట కొనుగొలు, అమ్మకంలోనే ఎందుకు ఇబ్బందులు తలెత్తున్నాయని? నిజానికి కేసీఆర్ చెప్పినట్లుగా.. పరిమితికి మించి పంట ఇక్కడ పండిందా.. లేక కావాలనే కేంద్రాన్ని దోషిగా చూపిస్తున్నారా అనేది తేలాల్సి ఉంది.
రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి..
కాగా తెలంగాణలో ఇటీవల మారుతున్న రాజకీయ సమీకరణాలు చూస్తుంటే.. తెరాసకు అనేక రకాలైన ఇబ్బందులు ఎదురవుతున్నాయనే చెప్పుకోవాలి. వాటిని కప్పిపుచ్చి.. తెలంగాణలో ఉన్నది ఒక్క రాజకీయ పార్టీ అది తెరాస మాత్రమేనని, ప్రజలు బలంగా నమ్ముతున్నది గులాబీని మాత్రమే అని చెప్పదల్చుకున్నారు. అయితే అనువైన పరిస్థితులు లేనందున.. కేంద్ర వైఖరి తప్పుబడుతూ దోషిగా చూపిస్తున్నారు. గులాబీ ఒక్కటే ఈ రాష్ట్రంలో పార్టీ అని వారు చాటదలచుకుంటే.. కమలవికాసం వారిని కంగారు పెడుతోంది.
also read : జగన్ అహం చంపుకున్నా.. ఫలం దక్కలేదు
వరి కంకులను అస్త్రంగా మార్చి బలంగా ఎక్కుపెట్టి తెలంగాణలో ఎదుగుతున్న కమలం పార్టీ రెమ్మలు విరిచేయాలని కంకణం కట్టుకున్నారు సీఎం. అయితే ఈ వరి ఏ పార్టీకి ఉరిగా మారుతుందో వేచి చూడాల్సిందే మరి.
..కె.శ్రీనివాస్
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

.

Discussion about this post