2021 చివరి రోజు ట్రేడింగ్ మదుపరులకు ఉత్సాహాన్నిచ్చింది. శుక్రవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనది లగాయతు సూచీల జోరు ఎక్కడా తగ్గలేదు. ఈరోజు కూడా విదేశీ మదుపర్ల ట్రేడింగ్ తక్కువ స్థాయిలోనే జరిగినప్పటికీ మార్కెట్లు చివరిదాకా లాభాల బాటలోనే సాగాయి.
ప్రధానంగా సిమెంట్, ఆటోమొబైల్ , స్టీల్, బ్యాంకింగ్ రంగాలకు సంబంధించిన షేర్లు దూకుడు ప్రదర్శించాయి. ఐటీ షేర్లు మాత్రం నిన్నటి హడావుడిని కొనసాగించలేకపోయాయి. స్మాల్, మిడ్ క్యాప్ షేర్ల జోరు ఎక్కడా తగ్గలేదు.
మరోపక్క జనవరి ఫ్యూచర్స్ & ఆప్షన్స్ ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఇక్కడ కూడా కొనుగోళ్ల మద్దతు కొనసాగినప్పటికీ , optons విభాగంలో ధరలు ఎక్కువగా ఉండటంతో… వాటి విలువలు గణనీయంగా తగ్గుతూ వచ్చాయి. సెన్సెక్స్ 459 పాయింట్లు పెరిగి 58253 పాయింట్ల వద్ద స్థిరపడగా, nifty 150 పాయింట్ల లాభంతో 17354 పాయింట్ల వద్ద ముగిసింది.
బీఎస్ఈ లో శుక్రవారం 3480 షేర్లు ట్రేడ్ అవ్వగా.. 2439 షేర్లు పెరిగాయి. 947 షేర్లు క్షీణించాయి. 94 షేర్ల ధరల్లో ఎలాంటి మార్పూ లేదు మొత్తం 430 షేర్లు 52 వారాల గరిష్ట స్థాయిని చేరగా … 16 షేర్లు 52 వారాల కనిష్ట స్థాయిలో ముగిశాయి. 719 షేర్లు అప్పర్ సర్క్యూట్ ని టచ్ చేస్తే… 107 షేర్లు లోయర్ సర్క్యూట్ ని తాకాయి . బీఎస్ఈ లో మొత్తం 3932 కోట్ల రూపాయల టర్నోవర్ జరిగింది.
ప్రధానంగా లాభపడ్డ షేర్లు: హిందాల్కో, టైటాన్ , అల్ట్రాటెక్, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంకులు
అధిక శాతం నష్టపోయిన షేర్లు: ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, సిప్లా, ఇన్ఫోసిస్ లు.
.. బెహరా శ్రీనివాసరావు
బిజినెస్ జర్నలిస్ట్

.