తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని కోరుతూ శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గరువారం ఆ పార్టీ నేతలు మృత్యుంజయ హోమం నిర్వహించారు.
చంద్రబాబు, లోకేష్ ఇటీవల కొవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముక్కంటి ఆలయంలో ఈ పూజలు చేశారు.
ఇద్దరికీ కి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని స్వామి, అమ్మవార్లను వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు రెడ్డి వారి గురవారెడ్డి, గాలి చలపతి నాయుడు, దశరథ ఆచారి, జిల్లా అధికార ప్రతినిధి చెంచయ్యనాయుడు, పట్టణ ప్రధాన కార్యదర్శి రవి, శ్రీకాళహస్తి మండలం మాజీ వైస్ ఎంపీపీ దొరై రాజ్ రెడ్డి,
తిరుపతి పార్లమెంటు మహిళా విభాగం అధ్యక్షురాలు చక్రాల ఉష, మహిళా అధ్యక్షురాలు ప్రమీలమ్మ, కోబాక లక్ష్మణ్, లత, సుబ్బయ్య వెంకటేష్ చౌదరి, మునిరాజాయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

.