ప్రధాని మోడీ వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం రైతుల విజయంగా సీపీఐ పార్టీ పేర్కొంది. ఈ మేరకు వారు నగరిలో ఓ కార్యక్రమం నిర్వహించి రైతుల విజయాన్ని అభినందించారు.
భారతదేశ చరిత్రలో సుదీర్ఘ పోరాటం పదకొండు నెలలపాటు కుటుంబాలను ఊరిని వదిలి ఢిల్లీ నడిబొడ్డున 11 నెలల పాటు సుదీర్ఘ పోరాటం చేయడం జరిగింది. ఈ పోరాటానికి దేశవ్యాప్తంగా అనేక పార్టీలు ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ రైతు చట్టాలకు వ్యతిరేకంగా రెండు భారత్ బంద్ లు కూడా నిర్వహించడం జరిగింది.
పోరాటంలో సుమారు 600 మంది పైచిలుకు రైతుల ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. చనిపోయిన రైతులకు ఒక్కొక్కరికి ఒక కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
అనేక కేసులు ప్రభుత్వం పెట్టడం జరిగింది రైతులు పైన, అంతేకాదు ఒక కేంద్ర మంత్రి కొడుకు కారుతో కూడా రైతులను తొక్కించి చంపడం జరిగింది. అయినా రైతు ఎక్కడా వెనుకడుగు వేయలేదు. రైతులను తీవ్రవాదులతో పోల్చిన ప్రభుత్వమే ఈ రోజు దిగివచ్చి చట్టాలను రద్దు చేస్తాం అని చెప్పడం రైతుల విజయం.
రాబోయే కాలంలో కర్షకులు కార్మికులు కలిసి కార్మిక చట్టాలు మార్చడం, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడం వీటికి వ్యతిరేకంగా ఉద్యమానికి ఈ యొక్క రైతుల పోరాటం స్పూర్తిగా ఉన్నది. రైతుల చట్టాలను వెనక్కి తీసుకోవడం రైతుల ఐక్య పోరాటానికి నిదర్శనం.
పోరాటానికి మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పక్షాలకు కార్మిక , ప్రజాసంఘాలకు సిపిఐ పార్టీ ధన్యవాదాలు తెలుపుతున్నది ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నగర నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్యా, సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి వేలన్, ఏ ఐ టి సి పట్టణ నాయకులు భాష రూప్ కుమార్ , సతీష్ రాజేంద్ర భూపతి ఉన్నారు.
.