నగరి వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో అఖిలభారత 68వ సహకార వారోత్సవాలను ఆప్కాబ్ ఏజీఎం కృష్ణా రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార వ్యవస్థ సభ్యుల ఉమ్మడి ప్రయోజనాల కోసం రైతుల ప్రయోజనాల కోసం దోహదపడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ సీనియర్ మేనేజర్ మల్లికార్జున, డి సి సి నోడల్ అధికారి మహమ్మద్, నగరి బ్రాంచ్ మేనేజర్ శరవణ కుమార్, గ్రామీణ బ్యాంక్ చైర్మన్ తిరుమల రెడ్డి, సీఈఓ తులసి పిళ్లె, లేపాక్షి రైతులు పాల్గొన్నారు
.