నగరి ఎమ్మెల్యే రోజా జన్మదినాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా అభిమానులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.
ఎమ్మెల్యే ఆర్కే రోజా జన్మదినం సందర్భంగా బుధవారం ఉదయం 10.00 గంటల నుంచి వేపగుంట మెయిన్ రోడ్డు GVR కన్వెన్షన్ హాల్ నందు అభిమానులు నిర్వహించిన సంబరాలు మిన్నంటాయి
కేక్ కటింగ్ లు వినోద కార్యక్రమాలు మరియు నృత్య ప్రతిభా ప్రదర్శనలతో ఆద్యంతం ఉల్లాసంగా జరిగిన కార్యక్రమంలో విచ్చేసిన ప్రతి ఒక్కరికి విందు ఏర్పాటు చేసి అతిధి మర్యాదలకు ఎటువంటి లోపం రాకుండా జాగ్రత్త పడ్డారు.

ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా గత 17 రోజులుగా రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కబడ్డీ, వాలీ బాల్ , బ్యాడ్మింటన్ మరియు బాలికల త్రో బాల్ క్రీడలలో మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి పోటీలలో ప్రథమ, ద్వితీయ స్థానాలు లో గెలుపొందిన వారికి సర్టిఫికెట్స్, మెడల్స్, ట్రోఫీలను మరియు ప్రైజ్ మనీ నగదు ను చెక్ రూపం లో ఎమ్మెల్యే రోజా స్వయంగా అందించారు.
చివరగా ప్రజల మధ్యలో ప్రజల సమక్షంలో ప్రజల చేత జరుపబడినటువంటి ఈ పుట్టినరోజు వేడుకలు గుర్తుండిపోయే విధంగా చేయాలని అంటూ ఎమ్మెల్యే రోజా ఇదే చోట మొక్క నాటి స్మృతి చిహ్నం ఏర్పాటు చేశారు.

.

Discussion about this post