నగరి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యురాలు ఆర్.కె.రోజా పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య చికిత్సల నిమిత్తం వచ్చిన గర్భిణీ మహిళలకు రోజా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో బుధవారం స్వయంగా భోజనం పంపిణీ చేశారు.
సుదూర ప్రాంతాలనుంచి వైద్య చికిత్సల కోసం వచ్చే గర్భిణీలు వేళకు పోషకాహారం లభించక
ఆందోళన చెందడాన్ని గమనించిన ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ఉదారతతో ఉచిత భోజన సౌకర్యాన్ని నగరి, పుత్తూరు ప్రభుత్వాసుపత్రులలో కల్పిస్తున్నారు.
పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రులలో బుధవారం వచ్చిన గర్భిణీ మహిళలకు వెజిటబుల్ రైస్, వెజిటబుల్ కుర్మా, పెరుగు రైతా, బర్ఫీ, కోడిగుడ్డు, అరటిపండుతో కూడిన పౌష్టిక ఆహారాన్ని బుధవారం స్వయంగా పంపిణీ చేశారు.
నగరి శాసన సభ్యురాలు ఆర్.కె.రోజా ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించడం పట్ల గర్భిణీ మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.
.

Discussion about this post