పుత్తూరు మునిసిపాలిటీ మరియు రూరల్ ప్రాంతాలలో భారీ వర్షాలకు నీరు ఇళ్ళ లోనికి చేరుకోవడంతో ప్రభుత్వం తక్షణ సహాయం కింద 25 కిలోల బియ్యం, కేజీ పప్పు, కేజీ వంటనూనె, మరియు కూరగాయలు అందించింది.
ఈరోజు మొత్తం 335 కుటుంబాలకు ఒక్కొక్కరికి పుత్తూరు మునిసిపల్ కార్యాలయం నందు నగదు రూ.2000.00 చొప్పున ప్రభుత్వ సహాయాన్ని ప్రత్యక్షంగా లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆర్కే రోజా అందించారు.
ఈ కార్యక్రమం లో చిత్తూరు డివిజన్ రెవెన్యూ అధికారిణి రేణుక, మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్స్, కో ఆప్షన్ మెంబర్లు, మరియు మునిసిపల్ కమీషనర్, మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి మరియు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
బాధితులకు ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా రోజా పేర్కొన్నారు.
వర్ష బాధితుల్లో ఏ ఒక్కరూ కూడా మిస్సవకుండా అందరికీ ఆర్థికసాయం అందేలాచూడాలని అధికారులను ఎమ్మెల్యే రోజా ఆదేశించారు.
.