ప్రశాంతంగా ఉన్న కుప్పం లాంటి ప్రదేశంలో దౌర్జన్య కాండాలు సృష్టించటం సరికాదు అని నగరి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు ముక్తకంఠంతో ఖండించారు.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నిన్న కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలలో వైసిపి నాయకులు విచ్చలవిడిగా దౌర్జన్యానికి పాల్పడ్డారని, ప్రశాంతంగా ఉన్న కుప్పంలో అరాచకాలతో ఓటర్లను, ప్రజలను భయభ్రాంతులను చేసి దొంగ ఓట్లు వేసుకున్నారని ఆరోపించారు.
151 మంది శాసనసభ సభ్యులను కలిగిఉన్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక మున్సిపాలిటీ ని చేజిక్కించుకోవడానికి అరాచకాలకు పాల్పడిందన్నారు. అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో వినియోగించి అక్రమాలకు పాల్పడటం సరికాదని నాయకులు విమర్శించారు.
ఈ నియోజకవర్గం నుంచి నారా చంద్రబాబునాయుడు ఏడు సార్లు ప్రాతినిధ్యం వహించినా ఇంతవరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, దుశ్చర్యలు, జరుగకుండా చూస్తూ ప్రజల అభిమానంపై గెలుస్తూ వస్తున్నారన్నారు . ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రజా నాయకుడిగా ప్రజల అభిమానిగా మనలను పొందిన చంద్రబాబు నాయుడు గారిపై కక్ష సాధింపుతో అక్కడి ఓటర్లను, ప్రజలను, పక్కదారి పట్టించటం సరికాదని నాయకులు విమర్శించారు.
అమరావతి రైతులు 700 రోజులుగా చేస్తున్న నిరసన కార్యక్రమం భాగములో న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు ”మహా పాదయాత్ర ”లో వస్తున్న సంఘీభావం తెలుపుతున్న రైతులపై లాఠీఛార్జి జరుపుట తీవ్ర అన్యాయమని నాయకులు విమర్శించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రమేష్ ,పార్లమెంట్ కార్యదర్శి బాలాజీ, మాజీ జిల్లా కార్యదర్శి జ్యోతి నాయుడు, ఆలయ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి , సీనియర్ నాయకులు అలీ ముత్తు , సలీమ్ ,కన్నయ్య ,యోగేంద్ర బాబు, యువత అధ్యక్షులు శ్రీధరు, టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ఆకుల అశోకు, మైనారిటీ కార్యదర్శి ఆన్సర్ , నాగరాజు పాల్గొన్నారు
.