సామాన్యులకు దొరకని ఇసుక, తమిళనాడు కు తరలి వెళ్తున్నదని సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శ కోదండయ్యా పట్టణ కార్యదర్శి వేలన్, భాష విమర్శించారు.
ఈ రోజు నగరి లో విచ్చలవిడిగా ప్రభుత్వ పథకాల పేరుతో కొంతమంది అధికార పార్టీకి చెందినటువంటి నాయకుల ద్వారా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నది. అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు.
దీనిపైన అనేకసార్లు, మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు, ఈరోజు నగరి ప్రజలకు ఇసుక అందుబాటులో లేకుండా మొత్తం కూడా తమిళనాడుకు తరలించడం జరుగుతుంది.
కొంత మంది అధికార పార్టీ నాయకుల అండతో ఇసుక దందా విచ్చలవిడిగా జరుగుతున్నది. శనివారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
ఈ రోజు మండల స్థాయి అధికారులు సమావేశం mepma కార్యాలయంలో జరుగుతున్నదని తెలిసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది . కానీ అధికారులు అందరూ అక్కడి నుంచి జారుకోవడం జరిగింది.
ధర్నా నిర్వహిస్తున్న సందర్భంగా అధికారులు వెళ్లి పోవడాన్ని సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది, ఇసుక రీచ్ దగ్గర రాజకీయ నాయకులకు ఏమి పని అని నిలదీశారు. ఇసుక రీచ్ లు ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో నడవాలన్నారు. ప్రభుత్వ అధికారుల ద్వారానే సామాన్యులకు ఇప్పించాలని డిమాండ్ చేశారు,
అనంతరం స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు వచ్చి ఆందోళనకారులతో చర్చలు జరిపి ఈరోజు నుంచి ఇసుక అక్రమాన్ని అరికట్టి, పూర్తి నిఘా ఉంచుతామని హామీ ఇవ్వడం జరిగింది.
సామాన్యులకు కూడా అందుబాటులో ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు . అక్రమంగా ఇసుక తరలిస్తే కేసులు పెడతామని, అదేవిధంగా బ్రిడ్జ్ దగ్గర ప్రధాన రహదారులు దగ్గర ఇసుక తీయకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు ఆందోళనకారులతో చెప్పారు.
.

Discussion about this post