నగరి మున్సిపాలిటీ పరిధిలోని వీధి విక్రయదారులు గుర్తింపు కార్డులు ఇచ్చి, సమస్యలు పరిష్కరించండి అని వీధి వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన 10 వేల రూపాయలు పూర్తిగా బ్యాంకులకు తిరిగి చెల్లించిన వారికి 20 వేల రూపాయలు లోను వెంటనే విడుదల చేయాలని వారు అభ్యర్థిస్తున్నారు.
ఈ మేరకు ఏఐటీయూసీ నగిరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, వీధి విక్రయ దారుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు.
ఈరోజు మున్సిపాలిటీ పరిధిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వీధి విక్రయదారులకు సౌకర్యాలు కల్పించి, గుర్తింపు కార్డులు ఇవ్వాలని వారు కోరుతున్నారు. పీఎం సహాయనిధి నుంచి 10 వేల రూపాయల రుణాలను పూర్తిగా చెల్లించిన వ్యాపారస్తులకు 20,000 వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అదేవిధంగా వీధి వ్యాపారస్తులకు స్ట్రీట్ వెండర్ కమిటీ వేయాలని, గేటు వసూలు నామమాత్రంగా వసూలు చేయాలని, ప్రధానంగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు,
అనంతరం మున్సిపల్ కమిషనర్, చైర్మన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా చైర్మన్, కమిషనర్ మాట్లాడుతూ గుర్తింపు కార్డులు త్వరలోనే ఇస్తామని, 10 వేలు పూర్తిగా చెల్లించిన వారికి 20000 బ్యాంకుల ద్వారా ఇప్పించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పట్టణ నాయకులు వేలన్, భాష రాజేంద్ర వీధి విక్రయదారులు సంఘం నాయకులు సైదాలి, ఆహ్ మధు, సాదిక్ కరిముల్లా అలీ మీది విక్రయదారులు పాల్గొన్నారు
.