శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలో ఇంటి, నీటి పన్ను బకాయి ఉన్న వారు వెంటనే చెల్లించాలని కమిషనరు బాలాజీ నాయక్ విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు ఆయన సోమమవారం విలేకరులతో మాట్లాడారు.
శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలో కొంతమంది పన్ను చెల్లించకుండా మొండిగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.
శ్రీకాళహస్తిలో ఇంటి పన్ను రూ. 3కోట్లకు పైగా… అదేవిధంగా నీటి పన్ను రూ.1.50 కోట్ల వరకు వసూలు కావాల్సి ఉందన్నారు.
ప్రతి ఒక్కరూ పన్ను చెల్లిస్తే పురపాలక సంఘాన్ని అభివృద్ధి చేయవచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు. ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించి పన్ను చెల్లించాలని కోరారు.
.