అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం అందరికీ ఆదర్శమని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్ టీయూ) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంటా మోహన్ అన్నారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతిని పురస్కరించుకుని బుధవారం ఉదయం బంగారు పాళ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కార్యక్రమం నిర్వహించారు.
పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి… ఆయన తెలుగు జాతి కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా గంటా మోహన్ మాట్లాడుతూ.. ఢిల్లీ స్థాయిలో తెలుగు జాతిని నిర్లక్ష్యం చేస్తూ… అవమానిస్తూ అనేక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు.
తెలుగు జాతిని కుట్రపూరితంగా రెండు రాష్ట్రాలుగా విభజించారని… ఇది పొట్టి శ్రీరాములు గారి ఆకాంక్షలకు గొడ్డలి పెట్టని అన్నారు.
శ్రీ రాములు గారి స్ఫూర్తితో తెలుగు జాతి సంక్షేమం కోసం ఆత్మ గౌరవం కోసం అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేంద్ర, రాధాకృష్ణ, నరసింహులు, జనార్దన్ రెడ్డి, మహమ్మద్ రఫీ, శ్రీకుమారి, హేమలత తదితర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
.