కులమతాలకు అతీతంగా జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పని కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య డిమాండ్ చేశారు.
సోమవారం ఏర్పేడు మండలం కోబాక పంచాయితీ లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం బృందం పరిశీలించింది.
కూలీల సమస్యలను వారు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నం పెంచలయ్య మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో ఉన్న ప్రతి ఒక్కరికీ కులాలు తో సంబంధం లేకుండా పని కల్పించాలన్నారు.
రెండు పూటలా పని చేయించే ఆలోచనను ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. గుంతలు కొట్టే పని తో పాటు… చెట్లు కొట్టిన ఉపాధి హామీ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పని చేసే స్థలంలో తాగేందుకు నీళ్ళు , మజ్జిగ , మెడికల్ కిట్టు ఇవ్వడం లేదని కూలీలు వాపోతున్నట్టు తెలిపారు. తక్షణమే జిల్లా వ్యాప్తంగా పని ప్రదేశాల్లో మౌళిక సదుపాయాల గురించి అలోచించి ఏర్పాటు చేయాలని లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఫీల్డ్ అసిస్టెంట్ ఈశ్వరయ్యకు కూడా వసతులు కలిపించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శ్రీకాళహస్తి ఏరియా అధ్యక్ష, కార్యదర్శులు జె.తులసీ రాజన్, మించల శివకుమార్, తొట్టంబేడు మండల కార్యదర్శి రుద్రాపాకు శ్రీనివాసులు , నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
.