శ్రీకాళహస్తి పట్టణంలోని సుందరయ్య భవనంలో ఈ నెల 19న నిర్వహించనున్న రైతుసంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా నాయకులు అంగేరి పుల్లయ్య పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తిలోని సుందరయ్య భవన్ లో మంగళవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రైతులకు గిట్టుబాటు ధర ఉండటం లేదన్నారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోతున్నారని చెప్పారు. పెరిగిన విత్తన, ఎరువుల ధరలతో అల్లాడి పోతున్నారని చెప్పారు. మరోవైపు నాసిరకం విత్తనాల సమస్య కూడా తీవ్రంగా ఉందన్నారు. ఈ సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. ఢిల్లీలో రైతులు ఏడాది కాలం పాటు నిరసన కార్యక్రమాలు చేశారనీ… బీజేపీ ప్రభుత్వం రైతులకు సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పి నేటికీ నాలుగు నెలలు పూర్తి కావస్తున్నా ఇంతవరకు ఒక్క సమస్య కూడా పరిష్కరించ లేదన్నారు. దీనిని బట్టి చూస్తుంటే ఈ ప్రభుత్వానికి రైతులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో తెలిసిపోతోందన్నారు. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో రైతులకు రాష్ట్రప్రభుత్వం సంక్షేమ నిధి కేటాయించి దానిద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని… రైతులకు సబ్సిడీ ద్వారా విత్తనాలు ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 19న జరిగే రైతు సంఘం జిల్లా మసభలో పై సమస్యలపై కార్యాచరణ రూపొందించి పోరాటాలు చేస్తామన్నారు.రు ఈ కార్యక్రమంలో జేవీవీ సీనియర్ నాయకులు షరీఫ్, పట్టణ కార్యదర్శి గంధం మణి, రేణిగుంట నాయకులు హరినాథ్, ఏర్పేడు నాయకులు రంగయ్య, తొట్టంబేడు నాయకులు గురవయ్య, కుమార్, మహిళా నాయకులు కుప్పమ్మ, ఈశ్వరయ్య, వెళ్లి వేంద్రం, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post