మళయాళంలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న మోహన్ లాల్ చిత్రం లూసిఫర్ ను మెగాస్టార్ చిరంజీవి తెలుగులో చేస్తున్నారు. ఈ చిత్రం మాతృకలో హీరోయిన్ ఉండదు. తెలుగులో చిరంజీవికోసం ఆయన ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని చేసే మార్పుల్లో హీరోయిన్ ను చొప్పిస్తారేమో తెలియదు. కానీ.. ఈ చిత్రంలో హీరోకు ఒక చెల్లెలు ఉంటుంది. ఆ పాత్ర ప్రాధాన్యం సినిమాలో చాలా ఉంటుంది.
లూసిఫర్ లో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు పాత్ర హీరోతో సమానమైన వెయిట్ తో ఉంటుంది. అంత గొప్ప పాత్రను ఎవరితో చేయించాలి. ఈ మీమాంసలో పడ్డ చిత్రబృందానికి చాలా మల్లగుల్లాలు పడిన తర్వాత.. రమ్యకృష్ణ తప్ప మరో ఆప్షన్ కనిపించలేదని సమాచారం.
అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించకపోయినప్పటికీ.. చిరంజీవి చెల్లెలుగా రమ్యకృష్ణ నటించబోతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.
వీరిద్దరి కాంబినేషన్లో ఎన్ని విజయవంతమైన చిత్రాలు వచ్చాయో లెక్కే లేదు. హిట్ పెయిర్ గా వారికి పేరుంది. రమ్యకృష్ణ మోస్ట్ రొమాంటిక్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న రోజుల్లో చిరంజీవితో జతగా చిత్రాలు చేశారు. ప్రస్తుతం ఆమె కేరక్టర్ పాత్రలు చేస్తున్నారు. గాంభీర్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉండే శివగామి లాంటి పాత్రలతో సెకండిన్నింగ్స్ ను చాలా ఘనంగా కొనసాగిస్తున్నారు. చిరు చిత్రంలో చెల్లెలి పాత్రలో ఎలా ఉండబోతున్నారు అనేది అభిమానులకు ఆసక్తికరమే.
లూసిఫర్ లో మెగాస్టార్ చిరంజీవి పోషించబోతున్న పాత్ర చాలా హుందాగా ఉంటుంది. ఎంతో ఆవేశం ఉన్న వ్యక్తే అయినా.. ఏదీ బయటకు కనపడనివ్వకుండా హుందాగా ఉండే వ్యక్తిగా, తన అనుకునే ప్రజల్ని కుటుంబాన్ని కంటికి రెప్పగా కాచుకునే వ్యక్తిగా, వారు తనను ద్వేషిస్తున్నా కూడా వారి మీద ఈగ వాలనివ్వకుండా కాపు కాచే కథానాయకుడిగా గొప్పగా ఉంటుంది. ఆ చిత్రంలో చెల్లెలు కథానాయకుడి పట్ల విపరీతమైన ద్వేషంతో మండిపడుతుంటుంది. అంటే చిరంజీవి అంటేనే మండిపడే, అతడి ఉనికిని కూడా భరించలేనంత ఆగ్రహంతో ఉండే చెల్లెలు పాత్రలో రమ్యకృష్ణ చేయబోతోందన్నమాట.
also read : జగన్.. ప్రభువు ప్రార్థన మిస్ కాకూడదనేనా? లేదా..
‘జగనన్నా ఆగలేం..’ వైఎస్సార్సీపీ ఆశావహుల గగ్గోలు
బద్వేలు ఫలితం నుంచి జగన్ నేర్చుకోవాల్సిన పాఠమేంటి?
మళయాళంలో మోహన్ లాల్ చెల్లెలిగా మంజు వారియర్ నటించారు. నిజానికి ఆమె కూడా ఆ పాత్రకు ఉండే స్వభావానికి గాంభీర్యానికి ఆగ్రహానికి చాలలేదనే అనిపించారు. అలాంటిది.. ఇప్పుడు ఆ చిత్రం తెలుగులో ‘గాడ్ ఫాదర్’ పేరుతో మోహన్ రాజా దర్శకత్వంలో తయారవుతోంది.
చెల్లెలి పాత్రకు ఉండే లక్షణాల విషయంలో రమ్యకృష్ణ ఎన్నోసార్లు తనను మించిన వారు లేరని నిరూపించుకుంది. శివగామి పాత్ర మాత్రమే కాదు.. నరసింహ చిత్రంలో రమ్యకృష్ణను అంత సులువుగా మర్చిపోవడం కుదర్దు. ఆ నేపథ్యంలోనే ఈ పాత్రకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
హీరోయిన్ గా చేసిన నాయికలు, తర్వాత చెల్లెలిగా చేయడం కొత్త విషయం ఏమీ కాదు. సావిత్రి కాలం నుంచి ఈ స్టయిల్ ఉంది. ఖుష్బూ కూడా చిరంజీవి అక్కగానూ నటించారు. కానీ రమ్యకృష్ణ సంగతి వేరు. చిరు- రమ్యకృష్ణ లను అన్నా చెల్లెళ్లుగా ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.