చిత్తూరు జిల్లా సత్యవేడు పోలీస్టేషన్ పరిధిలో నమోదైన ఛోరీ కేసులను పోలీస్ లు చేధించారు. ఆరుమందిని అరెస్ట్ చేసివారి వద్ధ నుండి 10 వేలు నగదు, 55 గ్రా”ల బంగారంను స్వాధీనం చేసుకుని,457,380 ఐపిసి సెక్షన్ ల ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
ఈసంధర్భంగా సిఐ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ
సత్యవేడు మండలంలోని దాసుకుప్పం గ్రామంలో కోమలి ,రమణయ్య అనే ఇద్ధరి ఇళ్ళల్లో ఎవరిని లేని సమయం చూసి తాళాలు పగులగొట్టి చోరీ పాల్పడి ఛోరి పాల్పడినట్లు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేశామన్నారు.
డిఎస్పీ యశ్వంత్ ఆదేశాలుతో సోమవారం ఉదయం ఇద్దరు ఎస్ఐ లు పరుషోత్తం రెడ్డి,వీరాంజనేయులతో కలిసి నిందితులను పట్టుకున్నామని తెలిపారు.
చోరీ లకు పాల్పడిన సుధన్(22), భూపాలన్(21), గజేంద్రన్(60), లక్ష్మణ్(25), శరణ్య(24), తమిళసెల్వి లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించన్నారు.
సత్యవేడు మండలపరిసర ప్రాంతం తమిళనాడు సరిహద్దు గా ఉన్నందున ఇళ్ళు వదిలి శుభకార్యాలకు ,బయట వెళ్లే వారుతప్పని సరిగా పోలీస్ లకు సమాఛారం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు.
.