చిత్తూరు జిల్లా సత్యవేడులో జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో వరద బాధితుల కోసం ఏర్పాటుచేసిన తాత్కాలిక పునరావాస కేంద్రాన్ని తిరుపతి ఆర్డిఓ కనక నర్సారెడ్డి ఆదివారం పరిశీలించారు. స్థానిక తహసిల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో సురేంద్ర నాథ్ తదితరులతో కలిసి ఆర్డీఓ కనక నర్సారెడ్డి జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలను సందర్శించారు .పునరావాస కేంద్రంలో వసతులను పరిశీలించారు .
హెచ్చరికలు అవసరం
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను ముందుగా గుర్తించి ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆర్డిఓ కనక నర్సారెడ్డి అధికారులు సూచించారు
వర్షపాతం
నవంబర్ 1 నుంచి 28వ తేదీ వరకు సత్యవేడు మండలంలో 629 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు . ఇంకా రెండు రోజులు పాటు భారీ వర్షాలు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని తిరుపతి ఆర్డిఓ కనక నర్సారెడ్డి సూచించారు .
ఈ కార్యక్రమంలో సత్యవేడు గ్రామ సర్పంచ్ మంజుల రమేష్ ,పంచాయతీ సెక్రెటరీ మునివాసులు , బాలుర గురుకుల పాఠశాల ప్రధానాచార్యులు శ్రీనివాసులు, వీఆర్వోలు ఇళయరాజా ,భార్గవ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గిరీష్ కుమార్ ,మహిళా పోలీస్ సునీత తదితరులు ఉన్నారు.
..
.