• About Us
  • Contact Us
  • Our Team
Friday, July 24, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

ఇక నారా భువనేశ్వరి డైరక్ట్ ఎటాక్!?

admin by admin
November 27, 2021
0
ఇక నారా భువనేశ్వరి డైరక్ట్ ఎటాక్!?

రాజకీయాల్లో అనూహ్యమైన విషయాలు ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. నందమూరి వారి ఇంటి ఆడపడుచు, నారా చంద్రబాబునాయుడు భార్య భువనేశ్వరి ఇక నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి కూడా రావచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరు మీద తానే నేరుగా విమర్శనాస్త్రాలను సంధించవచ్చు. తనను అనవసరంగా రచ్చకీడ్చిన వారితో నేరుగానే అమీతుమీ తేల్చుకోవచ్చు.

రాజకీయాల్లోకి రావడం అంటే.. ఎన్నికల్లో పోటీచేయకపోవచ్చు గానీ.. ఎన్నికల ప్రచారంలో నేరుగా పాల్గొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబునాయుడు ప్లాన్ చేసిన కార్యచరణ ప్రణాళిక, నారా భువనేశ్వరి పరంగా జరుగుతున్న పరిణామాలు అన్నీ ఇలాంటి అభిప్రాయానికి బలం చేకూరుస్తున్నాయి.

ఈ విశ్లేషణలకు, ఊహాగానాలకు బలం ఇస్తున్న మూలాల్లోకి వెళితే..

నారా భువనేశ్వరి.. తొలినుంచి కేవలం ఇంటికి, వ్యాపార సామ్రాజ్యానికి మాత్రమే పరిమితమైన వ్యక్తి. ఆమె ఎన్నడూ ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లోనూ పాల్గొనేవారు కాదు. ఎలాంటి బహిరంగ కార్యక్రమాలకు వచ్చేవారు కాదు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న పద్నాలుగేళ్లలో కూడా ఆమె ఎన్నడూ అధికార కార్యక్రమాల్లో పాల్గొన్నట్టుగా గానీ, తెరవెనుక నుంచి రాజకీయ నిర్ణయాల్లో జోక్యం చేసుకున్నట్టుగానీ ఎలాంటి తార్కాణాలు లేవు.

Also Read : మంచితనం నిరూపించుకున్న వైసీపీ ఎమ్మెల్యే భూమన

కేవలం కుటుంబం, బిజినెస్ మాత్రమే ఆమె సామ్రాజ్యం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా.. ఆలయాల ధార్మిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి సతీసమేతంగా హాజరు కావడం సాంప్రదాయంగా ఉన్న సందర్భాల్లో మాత్రమే భువనేశ్వరి బయట కనిపించే వారు.

Also Read : ఈ రాశుల్లో పుడితే.. ప్రేమను బయటకు చెప్పలేరుట!

అయితే ఇప్పుడు నారా భువనేశ్వరి పేరు రాజకీయాల్లో చాలా ముమ్మరంగా వినిపిస్తోంది. తెలుగుదేశం తరఫున గెలిచినా.. వైసీపీ గూటికి చేరిన వల్లభనేని వంశీ హేయమైన రీతిలో చేసిన సిగ్గుమాలిన వ్యాఖ్యలు.. ఆమెను రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం చేశాయి. వంశీ ఎన్నడో వ్యాఖ్యలు చేసినా.. చంద్రబాబు కుటుంబం వాటి పట్ల స్పందించలేదు. మిన్నకుండిపోయారు. కానీ శాసనసభలో కూడా అదే ప్రస్తావన రాబోతున్న తరుణంలో చంద్రబాబు స్పందించారు.

ఆ తర్వాతి ఎపిసోడ్ అందరికీ తెలిసిందే. చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ విషయంపై నానా రాద్ధాంతం అయింది. ఆయన కన్నీళ్ల గొడవను వైసీపీ ఇగ్నోర్ చేసి ఉన్నా అక్కడితో ఆగేది. వారు అవి డ్రామా కన్నీళ్లంటూ నానా విమర్శలూ చేశారు. భార్యను రోడ్డుమీదికి లాగి రాజకీయం చేస్తున్నాడని అన్నారు.

Also Read : చంద్రబాబు కన్నీళ్లు ఆయనకు మేలు చేస్తున్నాయా? నిజమేనా?

చంద్రబాబు నాయుడు కూడా ఆ పరాభవాన్ని, తన భార్యకు ముడిపెట్టి అసభ్యంగా మాట్లాడిన తీరును అక్కడితో వదిలిపెట్టదలచుకోలేదు. ఆయన డిసెంబరు 1వ తేదీనుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపట్టణంలోను, పల్లెలోను నిర్వహించేలా ఆడపడచుల ఆత్మగౌరవ సభలు ప్లాన్ చేశారు. ఇది చాలా పెద్ద కార్యక్రమం. ఎంత మేరకు సక్సెస్ అవుతుందనేది వేరే సంగతి.

కీలకమైన విషయం ఏంటంటే… ఈ ఆడపడచుల ఆత్మగౌరవ సభల్లో భాగంగా జరగబోయే ప్రధాన వేదికల కార్యక్రమాలకు నారా భువనేశ్వరి కూడా స్వయంగా హాజరవుతారనేది ఒక అంచనా. ఎన్నడూ ఏ రూపంలోనూ మీడియాలోకి వచ్చిన దాఖలాలు, అలవాటు లేని నారా భువనేశ్వరి.. తనకు జరిగిన అవమానం పట్ల, తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆమె మీడియాలోకి తనంతగా రావడం బహుశా ఇదే ప్రథమం. ఆమె రాజకీయ అరంగేట్రానికి ఇది పూర్వరంగం అని పలువురు విశ్లేషిస్తున్నారు.

Also Read : మగాళ్ల దినోత్సవం రోజున మోడీ వెనక్కి తగ్గితే, చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చాడు

ఆమె ప్రకటన వచ్చిన సమయానికి చంద్రబాబు ఆడపడచుల ఆత్మగౌరవ సభలు ప్రకటించారు. ఆ సభలు ఎటూ కొన్ని చోట్ల భారీగా నిర్వహించే ప్రణాళిక ఉంది. ఆ సభలకు నారా భువనేశ్వరి స్వయంగా హాజరై తనకు జరిగిన అవమానం పట్ల ప్రభుత్వం మీద డైరక్టుగా విమర్శలకు దిగితే వచ్చే స్పందన వేరుగా ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు.

Also Read : మాట మార్చేసి ఏమార్చే నేత జగన్

ఆ సభలలో వచ్చే స్పందనను బట్టి.. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ ప్రచారంలో కూడా భువనేశ్వరి కీలకంగా ఉంటుందనేది అంచనా. ఏం జరుగుతుందో.. చంద్రబాబునాయుడు బుర్రలో ఇంకా ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో.. ఈ ఆత్మగౌరవ సభలు టాప్ గేర్ లోకి వచ్చే సమయానికి అర్థమవుతుంది.

చంద్రబాబు గౌరవం- చెవిరెడ్డి మర్యాద.. సూపర్!

ఎమ్మెల్యేపై పగ.. జగన్ మామయ్యకు సెగ!

షర్మిల : అన్నయ్యను అడగలేదేం చెల్లెమ్మా!

Tags: atmagourava sabhabhuvaneswari into politicslokeshnara bhuvaneswarinara chanrababu naidutelugudesamతెలుగుదేశంనారా చంద్రబాబునాయుడనారా భువనేశ్వరిప్రత్యక్షరాజకీయాల్లోకి భువనేశ్వరిరాజకీయాల్లోకి భువనేశ్వరి
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply