విహార యాత్రకు వచ్చిన కుటుంబంలో విషాదం అలముకుంది. రోజంతా సరదాగా గడిపి తిరిగి వెళుతున్న వారిలో కుటుంబపెద్ద హఠాన్మరణానికి గురికావడం సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది.
ప్రముఖ పర్యాటక కేంద్రం ఉబ్బలమడుగుకు కుటుంబ సమేతంగా వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ ప్రభాకర్ రెడ్డికి తిరుగు ప్రయాణంలో వరదయ్యపాళెం మండలం దరఖాస్తు గ్రామ సమీపంలో కార్ డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు వచ్చింది.
దీంతో వాహనం హటాత్తుగా పక్కనే ఉన్న నీటి కాలువ లోకి దూసుకెళ్లింది.
అసలే గుండెపోటు, పైగా కారు ప్రమాదం.. ప్రభాకర రెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియాకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కారు కాలువలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి.
ప్రభాకర్ రెడ్డి స్వగ్రామం సత్యవేడు మండలం చేరివి పంచాయితీ చిగురుపాలెం గా సమాచారం. ఇతను హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
.

Discussion about this post