చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మల్లవారిపాలెం తూర్పు గ్రామంలో గత కొంత కాలంగా నెలకొన్న తాగునీటి ఇబ్బందులను తొలగించడానికి శ్రీసిటీ యాజమాన్యం చొరవ చూపింది.
ఇందులో భాగంగానే గ్రామంలోని జగన్ ఇంటికి సమీపంలో పంచాయతీ బోరుకు బిగించిన విద్యుత్ మోటారు పూర్తిగా దగ్ధమయ్యాయి.
దీంతోపాటు బోరు పైపులు కూడా పాడవడంతో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు పడ్డారు. సమాచారం తెలుసుకున్న శ్రీసిటీ యాజమాన్యం ప్రతినిధులు వెంటనే రంగంలోకి దిగి బోరుకు పైపులు ఏర్పాటు చేయడంతో పాటు కొత్త విద్యుత్ మోటార్ను శనివారం బిగించడం జరిగింది .
యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి పూర్తి చేయడంతో ఆదివారం నుంచి తాగునీటి సరఫరా యధావిధిగా పునరుద్ధరణ అయింది .ముఖ్యంగా శ్రీసిటీ పరిధిలోని అనేక గ్రామాల్లో మౌళిక వసతులు కల్పించడం , సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఉచిత వైద్య శిబిరాలు, పచ్చదనం పరిశుభ్రత ,కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా చెట్లు నాటడం వంటి పలు కార్యక్రమాలకు పెద్దపీట వేయడం వల్ల అక్కడ ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి.
ఏది ఏమైనా సిఎస్ఆర్ నిధులతో కొత్త విద్యుత్ మోటారు పంపు సెట్టు బిగించి తాగునీటి ఇబ్బందులు తొలగించడం పట్ల మల్లవారిపాలెం తూర్పు గ్రామ సర్పంచ్ పార్వతి సన్యాసయ్య ఎం పి టీ సీ సురేంద్ర గ్రామస్తులు పలువురు ఈ సందర్భంగా శ్రీసిటీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు .
.

Discussion about this post