అయ్యా జగన్ రెడ్డి గారూ తమను ఉద్దారిస్తావేమో అని పేద మహిళలు ఓట్లు వేస్తే ఆ పేదమహిళలు దాచుకుంటున్న సొత్తు కూడా కాజేస్తావా అంటూ తిరుపతి పార్లమెంట్ తెలుగుమహిళ అధ్యక్షురాలు చక్రాల ఉష ధ్వజమెత్తారు. మహిళా సాధికారత సాధిస్తాం అంటూనే మహిళల నోరు కొడతారా అని ఆమె ప్రశ్నించారు.
మహిళలకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఆ రోజుల్లో చంద్రబాబు డ్వాక్రా సంఘాలను స్థాపించి ఆర్ధిక స్వేచ్ఛ ఇస్తే మీరేమో ఆ డ్వాక్రా మహిళల సొత్తు కాజేస్తూ డ్వాక్రా వ్యవస్థను కూకటివేళ్లతో సహా పెకలించేస్తున్నావు పొదుపు ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తున్నావు అని ప్రశ్నించారు.
వృధాప్యం లో కొండంత అండగా ఉంటుందనే ఆశతో అభయహస్తం పథకం లో డ్వాక్రా సంఘాల పేద మహిళలు రూపాయి రూపాయి దాచుకున్న సొత్తు రూ 2,118కోట్ల రూపాయలు వైసీపీ ప్రభుత్వం కాజేయడం దుర్మార్గపు చర్య అని చక్రాల ఉష అభివర్ణించారు.
మహిళా సంక్షేమం మహిళా సాధికారత గురించి గొప్పలు చెప్పే మీరు ఆచరణలో పేదోళ్ల పొదుపు సొమ్మును కూడా లాక్కొనే దుస్థితిలో ఉండడాన్ని తప్పుపట్టారు. ఇప్పటికే పొదుపు మహిళలు దశాబ్దాలుగా పైస పైసా కూడబెట్టి బ్యాంకుల్లో జమచేసుకున్న రూ 8,702కోట్ల మూల ధానాన్ని కొట్టే ప్రయత్నం చేస్తూ అభయ హస్తం నిధులను లాక్కుంటూ మహిళలను మోసం చేయడం దారుణం అన్నారు. మీరు చేసే తుగ్లక్ పనులకు LIC ఒప్పందం రద్దు చేసుకుంటుందంటే మీరు చేసే తప్పులు ప్రజలకు చెప్పాల్సిన భాద్యత మీమీద ఉందని చక్రాల ఉష నిలదీశారు.
ఆమె తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 34లక్షల మంది డ్వాక్రా మహిళలు రూపాయి చొప్పున సంవత్సరానికి 365రూ చెల్లిస్తే పలు ప్రయోజనాలను కల్పించేలా గత ప్రభుత్వం ఈ పథకం రూపొందిoచి LIC ద్వారా అమలు చేస్తుండేది ఈ పధకం ద్వారా డ్వాక్రా మహిళలు సుమారు 136కోట్ల రూ ప్రీమియo చెల్లీస్తూ పలు ప్రయోజనాలు పొందేది
ఈ పథకం అమలు చేయలేము అంటూ LIC తప్పుకుంటే మీ ప్రభుత్వం అభయహస్తం పధకం ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం నుండి ఎటువంటి హామీ రాకపోవడం దుర్మార్గం అన్నారు.
అభయ హస్తం ప్రయోజనాలు
2008ఉమ్మడి ఏపీ లో ప్రారంభమైన ఈ పధకం ద్వారా 4,21,837మంది ప్రతి నెల 500నుంచి 2,200వరకూ పెన్షన్ పొoదుతున్నారు
60సం దాటినమహిళలు వారు ఇప్పటి వరకూ చెల్లించిన సొమ్ము ఆధారంగా పెన్షన్ పొందుతున్నారు
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళల పిల్లలు 9,10,11,12తరగతుల్లో చదివే విద్యార్థులకు రెండు విడతల్లో 2,400రూ స్కాలర్షిప్ వచ్చేది
ఈ పధకం లో డ్వాక్రా మహిళలు సహజమరణం సంభవిస్తే 75వేలు, ప్రమాదం లో చనిపోతే రూ 3,75లక్షల రూ వచ్చేది
తుగ్లక్ చర్యలతో డ్వాక్రా సంఘాలకు తీవ్ర నష్టo రాబోతోంది
1995లో మహిళల్లో సహజంగా ఉన్న పొదుపు గుణాన్ని గుర్తించిన చంద్రబాబు డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి అప్పట్లోనే డ్వాక్రా మంత్రిగా బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి ద్వారా డ్వాక్రా మహిళలు ఆర్ధిక ఎదుగుదలకు కృషిచేశారు. చిన్నపాటి పరిశ్రమలు పెట్టుకొనే వారి కళ్ళమీద వాళ్ళు బతికే అవకాశం ఇస్తే ఇప్పడు ఈ జగన్ రెడ్డీ సర్కార్ అనుభవరాహిత్యం వల్ల డ్వాక్రా సంఘాల ఉనికే మట్టిలో కలిపేస్తూ ఉంది పేద మహిళలు కుటుంబ భారం మోయలేక డ్వాక్రా సంఘాల ద్వారా లోన్లు పొందుతూ తమ బిడ్డలకు భరోసాగా ఉంటే ఈ తుగ్లక్ రెడ్డీ చర్యలతో మహిళల బతుకులు పూర్తి నిర్వీర్యం అవడం బాధాకరం అంటూ తిరుపతి పార్లమెంటు తెలుగు మహిళ అధ్యక్షురాలు చక్రాల ఉష వాపోయారు
.

Discussion about this post