శ్రీకాళహస్తి శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మల్లెంబాకం మునికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ ఫర్నిచర్ షాప్ లో గీతా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంజూరు తారక శ్రీనివాసులు పాల్గొన్నారు.
ముందుగా ఇస్కాన్ శ్రీ కృష్ణ భక్తిని తులసి నారాయణ దాస్ శ్రీకృష్ణ విగ్రహానికి ప్రత్యేక అలంకరణలో పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులచే హరే రామ హరే కృష్ణ పారాయణం చేయించారు.

ఈ సందర్భంగా శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మునికృష్ణారెడ్డి మాట్లాడుతూ వ్యక్తి వికాసానికి భగవద్గీత ఒక మంచి గ్రంథమని లోకంలో ఉన్న సర్వ విషయాలు ఇందులో ఉన్నాయని ఇందులో లేనివి మరెక్కడా లేవు అన్నారు.
భగవద్గీత వేదాలలో ఒక భాగం అని ఇందులో 108 ఉపనిషత్తులు ఉన్నాయని బ్రహ్మచే వ్యాసమహర్షి రచించిన ఒక మహా గ్రంథమని భగవద్గీతను నిత్య జీవితంలో ప్రతి ఒక్కరు ఆచరించాలని అన్నారు.
అనంతరం భక్తులకు భగవద్గీత గ్రంథాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో క్షత్రియ సంఘం అధ్యక్షులు కృష్ణారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రముఖ న్యాయవాది లక్ష్మీపతి రెడ్డి, మధు రెడ్డి, ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు రమణన్న, బలరాం రెడ్డి, బాలకృష్ణ, సుబ్బరామిరెడ్డి, కుమార్ యాదవ్, యాసీన్, జుబేదా బేగం తదితరులు పాల్గొన్నారు.
.