తొట్టంబేడు మండలం పూడి గ్రామానికి చెందిన జె. సుధారాణి, జె శేషమనాయుడు అనే వారు బెంగళూరులో నివాసముంటున్న
తమ బావ వెంకట సుబ్బానాయుడు అందించిన నెబులైజర్లును శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి బుధవారం వితరణగా ఇచ్చారు.
ఆస్పత్రిలో చికిత్స పొందే చిన్నారులకు ఎంతో ఉపయోగపడే ప్రస్తుత పరిస్థితుల్లో నెబులైజర్ లను అందించడంతో దాతలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంటు డాక్టర్ రమేష్ చంద్ర ప్రసాద్, డాక్టర్ శ్రీనివాస్, సిబ్బంది సురేష్ తదితరులు పాల్గొన్నారు.
.