చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఈరోజు శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేశారు.
కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కుటుంబానికి ఆలయ కార్యనిర్వాహణాధికారి. పెద్దిరాజు ఆదేశాల మేరకు ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల గర్భాలయం ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం శ్రీ మేధా దక్షిణామూర్తి సన్నిధి వద్ద ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి డి పెద్దిరాజు. ఆలయ డిప్యూటీ ఈవో ఎన్.ఆర్ కృష్ణారెడ్డి. ఏ ఈ ఓ ధనపాల్ ప్రోటోకాల్ సూపర్నెంట్ నాగభూషణం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
.